హీరోగా మరోసారి రిస్క్ తీసుకుంటున్నాడా..?

కమెడియన్ సునీల్ హీరోగా మారి సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. హీరోగా మొదట్లో రెండు, మూడు సక్సెస్ లు అందుకున్న సునీల్ ఆ తరువాత మాత్రం సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. వరుసగా మాస్ సినిమాలు చేస్తూ ప్లాప్ మీద ప్లాప్ తన లిస్ట్ లో వేసుకుంటూ వెళ్లిపోయాడు. ఒకానొక దశలో ప్రేక్షకులు అతడి సినిమాలు పట్టించుకోవడం మానేశారు. దీంతో హీరో వేషాలకు గుడ్ బై చెప్పేసి మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు.

నెగెటివ్ రోల్స్ లో కూడా కనిపించాడు. కానీ ఇవి కూడా సునీల్ కెరీర్ కి పెద్దగా కలిసిరాలేదు. అయినప్పటికీ ఇండస్ట్రీలో అతడికి అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ‘ఎఫ్3’ తో పాటు రెండు, మూడు సినిమాలు చేస్తున్న సునీల్.. ఇప్పుడు హీరోగా ఓ సినిమాను లైన్ లో పెట్టాడు. అది కూడా తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతుండటం విశేషం. ఈ సినిమాకి ‘డీటీఎస్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘డేర్ టు స్లీప్’ అనేది ఈ టైటిల్ అర్ధం.

చేతన్ అనే మరో యంగ్ కన్నడ హీరో కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. డోనల్, నటాషా అనే ఇద్దరు కొత్తమ్మాయిలు హీరోయిన్లుగా కనిపించనున్నారు. అభిరాం పిల్ల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. నిజానికి సునీల్ సినిమాలకు తెలుగులో మార్కెట్ బాగా తగ్గిపోయింది. అలాంటిది ఇప్పుడు కన్నడలో కూడా ఆయన సినిమా తీస్తున్నారంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కనీసం ఈ సినిమాతోనైనా సునీల్ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి!

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.