అనసూయతో సునీల్ రొమాన్స్

కామెడీ నుంచి హీరోగా ఒక ట్రాక్ సెట్ చేసుకోవాలని అనుకున్న సునీల్ ఆ తరువాత వరుస అపజయలతో మళ్ళీ కమెడియన్ గా యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. కేవలం కామెడితోనే కాకుండా ఇటీవల కలర్ ఫొటోతో కూడా విలన్ గా సరికొత్తగా దర్శనమిచ్చాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల సునీల్ వేదాంతం రాఘవయ్య అనే సినిమాను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

హరీష్ శంకర్ కథ అందించగా కొత్త దర్శకుడు సి. చంద్రమోహన్ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఎందుకంటే సునీల్ తో మొదటిసారి జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ రొమాన్స్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. అంటే మొదటిసారి కథానాయకుడికి జోడిగా నటిస్తోందన్నామట. దర్శకుడు చంద్ర మోహన్ ఇప్పటికే ఆమెకు ఫుల్ స్క్రిప్ట్ వినిపించినట్లు సమాచారం.

ఇక అనసూయ వినగానే పాజిటివ్ గా స్పందించినట్లు టాక్. అయితే ఇంకా ఆమె ఫుల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. త్వరలోనే ఆలోచించుకొని తన నిర్ణయాన్ని చెబుతానని సమాధానం ఇచ్చిందట. ప్రస్తుతం అనసూయ పలు తెలుగు సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. అలాగే తమిళ్ లో కూడా త్వరలోనే ఒక డిఫరెంట్ సినిమాలో నటించనున్నట్లు టాక్ వస్తోంది.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.