సునీల్ కన్నడ రీమేక్ కి ఓకే చెప్తాడా..?

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ కి ఆ తరువాత హీరోగా అవకాశాలు వచ్చాయి. ‘అందాల రాముడు’, ‘మర్యాద రామన్న’ వంటి సినిమాలు సక్సెస్ అవ్వడంతో హీరోగానే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో వరుస సినిమాలు చేశాడు. కానీ అన్నీ ఫ్లాప్ అవ్వడంతో హీరోగా సునీల్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పడినట్లైంది. ఆయనకి సినిమాల్లో అవకాశాలు ఇచ్చేవారు కరువయ్యారు. దీంతో మళ్లీ కమెడియన్ గా టర్న్ తీసుకొని అవకాశాల కోసం ప్రయత్నించాడు.

ఈ క్రమంలో కొన్ని సినిమాలు చేశాడు. ఇక రీసెంట్ గా ‘ఆహా’లో విడుదలైన ‘కలర్ ఫోటో’ సినిమాలో విలన్ గా కనిపించాడు. కానీ సునీల్ కి విలనిజం పెద్దగా సూట్ అవ్వలేదు. కమెడియన్ గానే సునీల్ కి ఇప్పుడు మళ్లీ ఆఫర్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో సునీల్ మళ్లీ హీరోగా నటించబోతున్నాడనే విషయం ఫిలింనగర్ లో హల్చల్ చేస్తోంది. కన్నడలో హిట్ అందుకున్న ‘బెల్ బాటమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారట.

కామెడీతో పాటు స్పై తరహా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో రిషబ్ శెట్టి, హరిప్రియ జంటగా నటించారు. ఈ రీమేక్ సినిమాలో సునీల్ ని హీరోగా తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే తిరిగి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు దక్కించుకుంటున్న సునీల్ ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ హీరోగా చేసే సాహసం చేస్తాడో లేదో చూడాలి!

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Share.