అమరావతిలో మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన హీరో సందీప్..!

సినీ ఇండస్ట్రీలో ఎవరి ప్లేస్ స్టాండర్డ్ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రేజ్ ను సంపాదించుకోవడానికి.. అలాగే దానిని కాపాడుకోవడానికి నిరంతరం కష్టపడుతూనే ఉండాలి. ఒక్కరకంగా చెప్పాలి అంటే.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన మాట. ఈ విషయం ఇండస్ట్రీలో ఉన్న హీరో, హీరోయిన్లకందరికి తెలుసు. అందుకే ఓ పక్క సినిమాల్లోకి చేసుకుంటూనే మరోపక్క సొంత వ్యాపారాలు కూడా మొదలు పెట్టేస్తున్నారు. మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి వారు ఇప్పటికే మల్టీ ప్లెక్స్ బిజినెస్ ను స్టార్ట్ చేసేసారు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ వంటి హీరోయిన్ కూడా పలు జిమ్ సెంటర్స్ ను నడుపుతుంది.

Sundeep Kishan Started New Business1

ఇక హీరో సందీప్ కిషన్ కూడా వారి బాటలోనే నడుస్తున్నాడు. ఇప్పటికే వివాహ భోజనంబు పేరుతో రెస్టారెంట్లను నడుపుతున్న సందీప్ కిషన్… నిర్మాతగా కూడా మారి ‘నిను వీడని నీడను నేనే’ వంటి హిట్ సినిమాని కూడా నిర్మించాడు. ఇప్పుడు ఏపీ రాజధాని అయిన అమరావతిలో ఓ సెలూన్ ప్రారంభించేందుకు కూడా సిద్ధమవుతున్నాడు సందీప్. ఇప్పటికే ఈ రంగంలో పేరుగాంచిన ‘క్యూబీఎస్ సెలూన్’ ఫ్రాంచైజీని సందీప్ తీసుకున్నాడని తెలుస్తుంది. అతి త్వరలో ఈ సెలూన్ ప్రారంభంకానుందని సమాచారం.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.