హాకీ ప్లేయర్స్‌ పరిస్థితి అలా ఉంది మరి: సందీప్‌ కిషన్‌

దేశంలో బాగా పేరొందిన ఆట ఏది అంటే… క్రికెట్‌ అని చెప్పొచ్చు. మరి జాతీయ క్రీడ ఏదీ అంటే హాకీ అని చెప్పొచ్చు. అయితే క్రికెట్లర్లకు ఉన్నంత పేరు, ప్రతిష్ఠలు, డబ్బులు హాకీ క్రీడాకారులకు ఉన్నాయా అంటే.. లేవనే చెప్పాలి. ఇదేదో మన మాట కాదు… చాలామంది సీనియర్‌ ఆటగాళ్లు, పరిశీలకులు చెబుతున్న మాట ఇది. తాజాగా యువ హీరో సందీప్‌ కిషన్‌ కూడా ఇలాంటి కామెంట్సే చేశాడు. దీంతో ఇప్పుడు అవి వైరల్‌గా మారాయి.

హాకీ క్రీడ నేపథ్యంలో సందీప్‌ కిషన్‌ ‘A1 ఎక్స్‌ప్రెస్‌’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల నేపథ్యంలో సందీప్‌ కిషన్‌ ఇటీవల విలేకర్లతో మాట్లాడాడు. ఈ సందర్భంగా హాకీ క్రీడాకారుల పరిస్థితి గురించి చెప్పుకొచ్చాడు. ఈ సినిమా చిత్రీకరణ కోసం మొహాలీ వెళ్లాడు. అక్కడి స్టేడియంలోనే సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ జరిగింది. దాని కోసం అండర్‌ – 19లో ఆడిన నిజమైన హాకీ ఆటగాళ్లు ఎనిమిది మందిని తీసుకున్నారట. వాళ్లు ఒక్కరోజుకు ఐదు వేల రూపాయలు ఇచ్చారట. వాళ్లు చాలా ఆనందంగా తీసుకొని, వెళ్లిపోయారట. తర్వాత ఆ విషయం తెలసుకున్న సందీప్‌ కిషన్.. ‘అదేంటి.. అంత తక్కువ తీసుకున్నారా’ అని షాకయ్యారట.

ఈ విషయాన్ని చెబుతూ… ‘ఆటగాళ్ల పరిస్థితి చూస్తే అర్థం చేసుకోవచ్చు వాళ్ల పరిస్థితి ఎలా ఉందో’ అని కామెంట్‌ చేశాడు సందీప్‌ కిషన్‌. దేశంలో హాకీ ఆటగాళ్లకు… క్రికెటర్లలా పారితోషికాలు లేవు, దేశీయంగా ఆడి సంపాదించుకునేలా ఐపీఎల్‌ కూడా లేదు. దాంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న హాకీ క్రీడాకారులు బయటకు వచ్చి ఆడే సౌకర్యాలూ లేవు. ఇవన్నీ నిపుణులు, పరిశోధకులు చెప్పే మాటలే. అదే మాటే సందీప్‌ కూడా అన్నాడు మరి.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.