పెద్ద సినిమాలు అన్నీ దసరాకే అంటే ఇబ్బందే…!

ఇప్పడు కరోనా ఎఫెక్ట్ వల్ల లాక్ డౌన్ కొనసాగుతోంది. షూటింగ్ లు ఆపేశారు… థియేటర్లు మూసేసారు..! ఇప్పుడు మన హీరోలందరూ ఇళ్ళల్లోనే ఉంటూ తమ ఫ్యామిలీస్ తో సమయం గడుపుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సమ్మర్ కి ఎన్నో సినిమాలు విడుదల చెయ్యాలి అని ముందుగా ప్లాన్ చేసుకున్నవారు ఉన్నారు. వీళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కల్పించకుండా పలు పెద్ద సినిమాలు ఆగష్ట్ నుండీ దీపావళి వరకూ ఆ పెద్ద సినిమాలు విడుదల తేదీలను లాక్ చేసుకుని కూర్చున్నాయి.

ఇప్పుడు ఎలాగూ సమ్మర్ అయ్యే వరకూ థియేటర్ లు తెరిచే పరిస్ధితి కనిపించడం లేదు. చెప్పాలంటే.. ఏప్రిల్ 2 వ తేదీకే ‘నిశ్శబ్దం’ ‘అరణ్య’ వంటి సినిమాలు విడుదల కావాల్సి ఉంది. తరువాత ‘వి’ ‘క్రాక్’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ‘లవ్ స్టోరీ’ వంటి సినిమాలు ఎప్పుడు విడుదల చేస్తారు. ఇక 2020 ద్వితీయార్థం నుండీ ‘నారప్ప’ ‘ఆచార్య’ ‘బాలయ్య 106’ వంటి బడా సినిమాలు ఉన్నాయి.

Summer release missed movies targeting Dussehra1

మరి ఆ సినిమా నిర్మాతలు ఎప్పుడో దసరా సీజన్ ను బుక్ చేసుకున్నాయి. మరి ముందు నుండీ ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఆ మీడియం సినిమాల గురించి వెనక్కి తగ్గుతారా… ఒకవేళ కాంప్రమైజ్ అయినా .. వాళ్లు డిసెంబర్ సీజన్ కు మారాల్సి ఉంటుంది. ఏది ఏమైనా 2021 ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలయ్యే లోపు ఆ సినిమాల విడుదలయితే సరి లేదంటే… కష్టమే.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Share.