పుష్ప మూవీ షూటింగ్ కూడా సెట్స్ లో ప్లాన్ చేస్తున్నారట

లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ అంతరాష్ట్రాల మధ్య రవాణా, షూటింగ్స్ కి అనుమతి లేదు. తెలంగాణా గవర్నమెంట్ మాత్రమే షూటింగ్స్ కి అనుమతులు ఇవ్వడం జరిగింది. అది కూడా అనేక పరిమితులు, జాగ్రత్తల మధ్య నిర్వహించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అవుట్ డోర్ షూటింగ్ కి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదు. భారీ చిత్రాలు సైతం సెట్స్ మధ్య షూటింగ్స్ నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కోసం అద్భుతమైన లొకేషన్స్ ఎంపిక చేసి ఉంచారు.

అయితే ఆయన అనుకున్నట్లు ఇతర రాష్ట్రాలలో లేదా దేశాలలో షూటింగ్ నిర్వహించే అవకాశం లేదు. అందుకే ఆయన 20కోట్ల రూపాయల వ్యయంతో ఓ భారీ సెట్ వేయిస్తున్నారు. కాగా టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో పాన్ ఇండియా చిత్రం పుష్ప. సుకుమార్ రెండ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా, బన్నీ డి గ్లామర్ రోల్ చేస్తున్నారు. కాగా షెడ్యూల్ ప్రకారం ఈ చిత్ర నెక్స్ట్ షెడ్యూల్ కేరళలో చిత్రీకరించాల్సి వుంది.

Allu Arjun's Pushpa Movie First Look Poster Review1

ఆ షెడ్యూల్ వాయిదా వేసిన చిత్ర బృందం మిగతా సన్నివేశాల షూటింగ్ పై ద్రుష్టి సారించారట. మొదట సెట్స్ తో చిత్రీకరించగలిగిన సన్నివేశాలు చిత్రీకరిస్తారట. అనంతరం అవుట్ డోర్ షూటింగ్ నిర్వహించనున్నారని వినికిడి. కథా నేపధ్యాన్ని బట్టి, చాలా భాగం అడవులలో చిత్రీకరించాల్సి వుంది. అందుకే కేరళ ప్రాంతాన్ని సుకుమార్ ఎంచుకున్నారు. ఏదైమైనా లాక్ డైరెక్టర్స్ ప్లాన్స్ మొత్తం మార్చి వేసింది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Share.