సుక్కుని మహేష్ లాక్ చేశాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి నుండి కూడా ఒక సినిమా పూర్తయిన తరువాత మరో సినిమా చేసేవారు. మిగిలిన హీరోలు ఒక సినిమా చేతిలో ఉండగానే మరో సినిమాని లాక్ చేస్తారు. కానీ మహేష్ మాత్రం సినిమా తరువాత సినిమా అని రూల్ పెట్టుకోవడంతో ఆయన ఫ్రీ అయ్యే సమయానికి సరైన దర్శకులు దొరకడం లేదు. అందుకే తన పద్దతిని మార్చుకొని మిగిలిన హీరోల మాదిరి వరుసగా దర్శకులను లైన్ లో పెడుతున్నాడు. మొన్నీమధ్య త్రివిక్రమ్ తో కలిసి కథా చర్చల్లో పాల్గొన్నాడు మహేష్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం పక్కా అని తెలుస్తోంది.

రీసెంట్ గా సుకుమార్ తో కూడా మహేష్ టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా.. విమర్శకులను మెప్పించింది. అందుకే సుకుమార్ పై మహేష్ కి నమ్మకం పోలేదు. నిజానికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి ముందు మహేష్.. సుకుమార్ తో సినిమా చేయాల్సివుంది. కానీ సెట్ కాలేదు. కానీ లాక్ డౌన్ సమయంలో సుకుమార్.. మహేష్ కి సరిపడా ఓ లైన్ అనుకున్నాడట. అదే లైన్ ని మహేష్ కి చెప్పినట్లు తెలుస్తోంది.

ఆయన కథగా డెవలప్ చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన తరువాత విజయ్ దేవరకొండతో సినిమా చేయాలి. ఆ తరువాతే మహేష్ సినిమా ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే మరో మూడేళ్ల వరకు ఎదురుచూడాలేమో!

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.