Pushpa Movie: ‘పుష్ప’సినిమా అనుకున్నట్లు తీయగలరా

‘పుష్ఫ’ సినిమా మొదలుపెట్టినప్పుడు ఈ సినిమా మామూలుగా ఉండదు అని చిత్రబృందం చెప్పింది. మామూలుగా సుకుమార్‌ సినిమా అంటేనే భారీగా ఉంటుంది. అందులోనూ అల్లు అర్జున్‌ లాంటి స్టార్‌ హీరో అనేసరికి ఇంకా భారీతనం ఉండనుంది. దానికి తగ్గట్టే ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్లు కనిపించాయి. అయితే ఇప్పటివరకు చూసింది జస్ట్‌ శాంపిల్‌ మాత్రమేనట. అసలు మజా ముందుంది అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఇప్పుడు మజానే లెక్కలు మాస్టార్‌ సుకుమార్‌కు చిక్కులు పెడతాయేమో అని కూడా అంటున్నారు.

మొన్నీ మధ్య వచ్చిన ‘పుష్ప’ టీజర్‌ చూశారు కదా? దానిని ఏ పేరుతో విడుదల చేసినా దాని లెక్క టీజరే. ఆ విషయం పక్కనపెడితే ఆ వీడియోలో రిచ్‌నెస్‌, డిఫరెన్స్‌, వావ్‌ ఫ్యాక్టర్స్‌ చాలా ఉన్నాయి. ఇదంతా పుష్పరాజ్‌ లారీ డ్రైవర్‌గా ఉన్నప్పుడు కనిపించే సీన్లకు మచ్చుతునకట. అయితే మరి పుష్పరాజ్‌ డాన్‌ అయ్యాక… అదీ అసలు మేటర్‌. ఈ బ్లాక్‌ను సుకుమార్‌ ఇంత స్టైల్‌గా తీస్తే వాటిని ఇంకెలా తీయాలి. దాని కోసం సుకుమార్‌ తగ్గేదేలే అంటున్నారట.

‘పుష్ప’ నెక్స్ట్‌ షెడ్యూల్‌ ఎప్పుడు అనేది తెలియడం లేదు. ఒకవేళ మొదలుపెడితే విదేశాలకు వెళ్తారు అనే మాట కూడా వినిపిస్తోంది. లేదంటే పెద్ద సెట్స్‌ వేసి విదేశాలు అని చూపిస్తారు అనే టాక్‌ కూడా ఉంది. ఇంకా కాదంటే గోవాలో కొన్ని కీ సీన్స్‌ తీస్తారనే మాట కూడా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ కష్టమే. మరోవైపు నవంబరు నాటికి కరోనా థర్డ్‌ వేవ్‌ అని కూడా అంటున్నారు. కాబట్టి లెక్కల మాస్టారి చిక్కులు ఎప్పటికి తేలేనో.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Share.