‘వి’ చిత్రంలో తన పాత్రను లీక్ చేసిన సుధీర్ బాబు

యూత్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే కాదు.. థ్రిల్లర్ సినిమాలు కూడా తెరకెక్కించగల దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. ‘అమీ తుమీ’ ‘సమ్మోహనం’ వంటి హిట్ చిత్రాల తర్వాత నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబులతో ‘వి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఇంద్రగంటి. ‘శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ‘సైరా’ వంటి భారీ బడ్జెట్ చిత్రానికి సంగీతమందిస్తున్న అమిత్ త్రివేది.. ఈ చిత్రానికి కూడా సంగీతమందిస్తున్నాడు. నివేదా థామస్,అదితిరావ్ హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

sudheer-babu-reveals-his-role-in-nanis-v-movie1

ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో తన పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా స్పందించాడు సుధీర్ బాబు. ‘వి’ చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ పాత్ర చేయనున్నాడట. ముందు నుండీ సుధీర్ బాబు ‘వి’ చిత్రంలో పోలీస్ పాత్ర పోషిస్తున్నాడని ప్రచారం జరిగింది. అది నిజమేనని సుధీర్ బాబు కన్ఫార్మ్ చేసాడు. ఇక నాని కూడా ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రని పోషిస్తున్నట్టు.. సినిమా మొదలైనప్పుడే కన్ఫార్మ్ చేశాడు. అంటే క్రైమ్ చేసే నానిని పట్టుకునే పాత్రలో సుధీర్ బాబు కనిపిస్తున్నాడన్న మాట.

Share.