20 ఏళ్ళ ప్రేమ… నెట్టింట హల్ చల్ చేస్తున్న మహేష్, నమ్రత ల ఫోటో..!

టాలీవుడ్లో మోస్ట్ అట్రాక్టివ్ కపుల్స్ లిస్ట్ లో ముందుంటారు మహేష్ బాబు, నమ్రత. అంతేకాదు వీళ్ళది ఆదర్శ జంట అని కూడా అంటుంటారు. మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన అన్ని ప్రమోషన్స్ మరియు అతని బ్రాండ్స్ వ్యవహారాలను నమ్రతనే దగ్గరుండి చక్కపెడతారన్న సంగతి తెలిసిందే. అంతేకాదు తన ఇద్దరి పిల్లలను.. అలాగే కృష్ణ గారి కుటుంబంలో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాలను కూడా చక్కపెడుతుంటుంది నమ్రత.

మహేష్ దత్తత తీసుకున్న రెండు గ్రామాలను.. అలాగే అతను చేస్తున్న సామజిక కార్యక్రమాల విషయంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది నమ్రత. ఇక వీరి మధ్య ప్రేమ చిగురించి 20 ఏళ్ళు పూర్తికావస్తుందట. 2000 వ సంవత్సరంలో ‘వంశీ’ సినిమా షూటింగ్ టైములో మహేష్, నమ్రత లు కలుసుకున్నారు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2005 లో పెళ్లి చేసుకున్న మహేష్, నమ్రతలకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు. వాళ్ళే గౌతమ్, సితార లు..! ఇక 20 ఏళ్ళు పూర్తయినప్పటికీ మా మధ్య ప్రేమ అలాగే ఉందని..

Story behind Mahesh Babu Namrata Shirodkar latest pic1

నమ్రత తన భర్తతో ఈ లాక్ డౌన్ లో తీసుకున్న పిక్ తో చెప్పకనే చెప్పింది. ‘ప్రేమే జీవితంలో ముఖ్యమైనది. అదే మనందరినీ కలిపి ఉంచుతుంది’ అంటూ తన మనసులో ఉన్న భావాన్ని పేర్కొంటూ ఈ పిక్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది నమ్రత. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Share.