సినీ ఇండస్ట్రీలో విషాదం.. కరోనాతో సంగీత దర్శకుడు మృతి!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ నిన్న మరణించారు. ఆయన వయసు కేవలం 42 సంవత్సరాలు. కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నాలుగు రోజుల క్రితం ముంబైలోని ఓ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. గత నాలుగు రోజులుగా ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ ఆయన కిడ్నీ ఇన్ఫెక్షన్ పెరిగిపోవడంతో ఆయన మరణించినట్లు తెలుస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ ఆయన బాడీలో మల్టిఫుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి కారణమైనట్లు సమాచారం.

వాజిద్ ఖాన్ మృతికి బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో రోజు వ్యవధిలో నటులు ఇర్ఫాన్ ఖాన్ మరియు రిషి కపూర్ మరణించారు. వాజిద్ ఖాన్ మరణంతో బాలీవుడ్ లో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇక వాజిద్ ఖాన్ బాలీవుడ్ లో అనేక ప్రముఖ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించారు. మరో మ్యూజిక్ కంపోజర్ సాజిద్ తో కలిసి ఆయన అనేక సినిమాలకు పని చేశారు.

సల్మాన్ సూపర్ హిట్ సిరీస్ దబంగ్ మూడు పార్టులకు సంగీతం వాజిద్ అందించారు. అలాగే సల్మాన్ నటించిన వాంటెడ్, ఏక్తా టైగర్ చిత్రాలకు కూడా ఆయన సంగీతం అందించడం జరిగింది.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Share.