ఆ హీరోలు వద్దన్నారు కాబట్టే.. ‘మ‌ల్లేశం’ కు న్యాయం జరిగింది..!

ఒకసారి హీరోకి మంచి స్టార్ ఇమేజ్ వచ్చిన తరువాత ప్రయోగాలు చేయడం కాస్త కష్టమే. అలా కాదని ప్రయోగాలు జోలికి వెళ్ళి చేతులు కాల్చుకున్న హీరోలను మనం చూస్తూనే ఉన్నాం. కమల్ హాసన్,విక్రమ్, సూర్య, మహేష్ బాబు లాంటి హీరోలు ఈ కోవకి చెందిన వాళ్ళే. సో వీళ్ళ సినిమాల రిజల్ట్స్ ను చూసి మిగిలిన హీరోలు ప్రయోగాలంటే బయపడి.. అవసరమైతే డైరెక్టర్లను కూడా మార్చేసి వారి అభిమానులకి కావాల్సిన కమర్షియల్ ఎలెమెంట్స్ ను జోడించి సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు. దీని వలన అభిమానులు తృప్తి చెందినా కథలో సహజత్వం మిస్సయ్యి సాధారణ ప్రేక్షకులు మాత్రం బాధపడుతుంటారు. అంతే ఆ కథ రాసుకున్న డైరెక్టర్ కూడా సంతృప్తి చెందాడు అనడంలో సందేహం లేదు.

ఇది పక్కన పెడితే.. ఇటీవల వచ్చిన ప్రియ‌ద‌ర్శి ‘మ‌ల్లేశం’ చిత్రానికి మంచి మార్కులు ప‌డ్డాయి. నిజాయ‌తీతో కూడిన ప్ర‌య‌త్నంగా విశ్లేష‌కులు ఈ చిత్రం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కమర్షియల్ గా పక్కన పెడితే.. చూసిన ప్రతీ ఒక్కరూ ‘మంచి సినిమా’ అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ యాస‌నీ, ఆచారాల్ని నూటికి నూరు పాళ్ళూ ఆవిష్కరించిన సినిమా ఇది అనడంలో సందేహం లేదు. ‘చింత‌కింది మ‌ల్లేశం’ అనే చేనేత కార్మికుడి జీవిత చరిత్ర ఈ సినిమా. వార్డులు వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఈ సినిమాకి పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. అలాంటి ఈ సినిమాని ఇద్ద‌రు పెద్ద హీరోల రిజెక్ట్ చేశారట. ‘క‌థ మరీ డాక్యుమెంట‌రీ రూపంలో ఉంద‌ని’ ఆ హీరోలు కాదన్నారట. ఆ హీరోలు మరెవరో కాదు.. నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ముందుగా ‘మల్లేశం’ కథని ఈ హీరోల‌కే వినిపించాడు ద‌ర్శ‌కుడు రాజ్‌. వాళ్ళు నో చెప్పడంతో ప్రియ‌ద‌ర్శి ద‌గ్గ‌ర‌కు వచ్చింది. హీరో ఇమేజ్ అనేది ‘మ‌ల్లేశం’ పాత్ర‌కు పెద్ద అడ్డంకి కాబట్టి… స్టార్ హీరోతో చేస్తే వాళ్ళ ఇమేజ్‌కి తగినట్టు క‌థ మార్చాల్సి వచ్చేదని ప్రియదర్శి తో చేసేసాడు రాజ్. దీంతో కథకి పూర్తి న్యాయం జరిగిందనే చెప్పొచ్చు.

Share.