పాపం మన రౌడీ అంత ప్రాబ్లెమ్ ఫేస్ చేశాడా?

విజయ్ దేవరకొండ.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. స్టార్ హీరో రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ‘పెళ్ళి చూపులు’ చిత్రంతో కంప్లీట్ హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ.. ఆ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాడు. అంతకు ముందే విజయ్ దేవరకొండ… ‘నువ్విలా’ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ‘పెళ్ళి చూపులు’ చిత్రం మేజర్ క్రెడిట్ మొత్తం కథ, కథనం, ప్రియదర్శి కామెడీకి దక్కాయి.

కాబట్టి విజయ్ తరువాతి సినిమా ఆ రేంజ్లో హిట్ అవుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి ముందే ఓ పెద్ద నిర్మాత విజయ్ దేవరకొండతో సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాడట. ఆ ప్రాజెక్ట్ కోసం కొంతమంది స్టార్ హీరోయిన్లను సంప్రదించగా వాళ్ళు విజయ్ కు జోడీగా నటించడానికి ఇంట్రెస్ట్ చూపలేదట. ఆ టైములో ‘అర్జున్ రెడ్డి’ చేసాడు విజయ్. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో .. విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

Vijay Devarakonda Gets Emotional On Fake News2

అయితే విజయ్ దేవరకొండ సినిమాలో నటించడానికి రిజెక్ట్ చేసిన హీరోయిన్లు ఎవరు అని ఆరా తీయగా రకుల్ ప్రీత్ సింగ్, అనూ ఇమాన్యుల్ పేర్లు మాత్రమే తెలిసాయి.ఇంకా మరికొందరు ఉన్నారట. కానీ మిగిలిన వాళ్ళ పేర్లు మాత్రం బయటకి రాలేదు. అయితే అప్పుడు హీరోయిన్ కోసం విజయ్ ఫేస్ చేసిన ప్రాబ్లెమ్ ను ఆధారం చేసుకుని ఓ వీడియో బయటకి వచ్చింది. మన రౌడీ ఫ్యాన్స్ ఆ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు.

Most Recommended Video

జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Share.