టాలీవుడ్ హీరోలందరూ నిర్మాతలైపోతున్నారు

టాలీవుడ్ హీరోలందరూ నిర్మాతల అవతారం ఎత్తుతున్నారు. వారు నటించే సినిమాల్లో నిర్మాణ భాగస్వాములుగా మారుతున్నారు. ఒకప్పుడు రెమ్యూనరేషన్ కే పరిమితమయ్యే హీరోలు, తమ సినిమాలకు ఖచ్చితంగా నిర్మాతలుగా ఉంటున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితమైన ఈ ట్రెండ్ టాలీవుడ్ కి పాకింది. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్, అక్షయ్ వంటి హీరోలు తాము నటించే ప్రతి సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో మహేష్, ప్రభాస్ లాంటివారు ఇప్పటికే తమ సినిమాలలో నిర్మాణ భాగస్వాములుగా ఉంటున్నారు. మహేష్ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్స్ పేరుతో శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు సినిమాల నిర్మాణంలో పార్ట్నర్ గా ఉన్నారు. అలాగే ఆయన నిర్మాతగా అడివి శేషు హీరోగా మేజర్ సినిమా నిర్మిస్తున్నారు.

Star Heroes takes share instead of remuneration1

ఇక ప్రభాస్ నటించే అన్ని సినిమాలు యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా, ప్రభాస్ స్లీపింగ్ పార్ట్నర్ గా ఉన్నాడు. తాజాగా ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రం తో చేస్తున్న తన 30వ చిత్రం కొరకు నిర్మాతగా మారడానికి టాక్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు కళ్యాణ్ రామ్ ఈ చిత్ర నిర్మాతగా ఉండగా ఎన్టీఆర్ కూడా అన్నతో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారట. నేడు నితిన్ హీరోగా లాంచ్ చేసిన అంధాదున్ తెలుగు రిమేక్ లో నిర్మాత మధుతో పాటు, నితిన్ నిర్మాతగా ఉన్నారు. ఇక చిరంజీవి సినిమాలన్ని రామ్ చరణ్ నిర్మిస్తుండగా, అల్లు అర్జున్ నటించే ప్రతి సినిమాలో గీతా ఆర్ట్స్ బ్యానర్ హస్తం ఉంటుంది. ఇలా ఇండస్ట్రీ లోని సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలు తమ సినిమాలకు నిర్మాణ బాధ్యతలు తీసుకుంటున్నారు.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.