మురుగదాస్ తో ఆ స్టార్ హీరో సినిమా క్యాన్సిల్..?

‘ఎ’ క్లాస్.. ‘బి’ క్లాస్.. ‘సి’ క్లాస్ అని లేదు.. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆయన సినిమాలు అలరిస్తూ ఉంటాయి. ఓ చిన్న సందేశం కూడా ఉంటుంది. ఆ డైరెక్టర్ ఎవరనేది మీకు అర్థమైపోయి ఉంటుంది కదా..! మీ గెస్ కరెక్టే… మురుగదాస్..! ప్రస్తుతం రజినీ కాంత్ తో ‘దర్బార్’ సినిమా తెరకెక్కిస్తున్న మురుగదాస్ కు.. ఇటీవల ఓ స్టార్ హీరో షాకిచ్చాడట. ‘దర్బార్’ పూర్తయ్యాక ఓ స్టార్ హీరోతో మురుగదాస్ సినిమా చేయాలనీ ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే కథ కూడా వినిపించి.. ‘ఓకే’ అని కూడా చెప్పించుకున్నాడు. కానీ ఆ స్టార్ హీరో ఇప్పుడు మురుగదాస్ తో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది.

AR Murugadoss latest Pic

ఆ స్టార్ హీరో మరెవరో కాదు అజిత్. ఇప్పుడు అజిత్ వరుస హిట్లతో ఫామ్లో ఉన్నాడు. దీంతో మురుగదాస్.. అజిత్ తో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అజిత్ 61 వ చిత్రంగా ఆ ప్రాజెక్ట్ ఉంటుందని అంతా అనుకున్నారు. దీంతో అజిత్ అభిమానులు కూడా ఎంతో సంబరపడిపోయారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘ధీనా’ (తెలుగులో ‘దాదా) అనే సినిమా చేశాడు. ఈ చిత్రం 2001 లో వచ్చింది. 18 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇంతకాలానికి ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అనుకుంటే.. అది కాస్త క్యాన్సిల్ అయ్యింది. ‘అజిత్ 61’వ చిత్రాన్ని వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయబోతున్నాడు.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.