కరోనా భారిన పడిన మరో సినీ హీరో?

కరోనా.. ఈ పేరుకి ఇంట్రడక్షన్ అవసరం లేదు. గత 4 నెలలుగా చిన్నా.. పెద్దా, పేద .. గొప్ప అనే తేడా లేకుండా అందరితోనూ పెక్యులర్ గా ఆడుకుంటుంది. గత కొద్ది రోజుల నుండీ సినిమా వాళ్ళను కూడా ఇది పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత బండ్ల గణేష్, ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ రవికృష్ణ,అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఇలా.. చాలా మంది సినీ సెలబ్రిటీలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో సినీ పరిశ్రమలో ఉన్న వాళ్లకు కూడా కరోనా భయం పట్టుకుంది.

ఇప్పడు మరో హీరోకి మరియు అతని భార్యకి కూడా కరోనా సోకిందట. వివరాల్లోకి వెళితే ప్రముఖ కన్నడ హీరో ధృవ్ షార్జా మరియు అతని భార్య ప్రేరణ శంకర్లకు కూడా కరోనా సోకిందనేది తాజా సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ధృవ్ షార్జానే తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ‘గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న తరుణంలో ఇటీవల కరోనా టెస్టులు చేయించుకోగా.. రిజల్ట్ లో పాజిటివ్ వచ్చినట్టు’ ఆయన తెలిపాడు.

ధృవ్ షార్జా మరెవరో కాదు మన యాక్షన్ కింగ్ అర్జున్ కు స్వయానా మేనల్లుడు. గత నెలలో ఇతని అన్నయ్య చిరంజీవి షార్జా గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచివెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ తమ్ముడు ధృవ్ ఇలా కరోనా భారిన పడటంతో ఆయన కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఇక ధృవ్ త్వరలోనే కోలుకోవాలని.. కన్నడ ఇండస్ట్రీ మొత్తం కోరుకుంటూ.. సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Share.