స్టార్ హీరోతో ప్రేమాయణం గురించి హీరోయిన్ కామెంట్స్

ఒకట్రెండు సినిమాల్లో జంటగా నటించిన ఇద్దరు హీరోహీరోయిన్ల నడుమ ప్రేమ చిగురించడం, ఆ ప్రేమ ఎఫైర్ కి దారి తీయడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. ఆ ఎఫైర్లు పెళ్లి వరకూ కొనసాగుతాయా లేక మధ్యలోనే ఆగిపోతాయా అనే విషయంలో ఎవరికీ పెద్దగా క్లారిటీ ఉండదు. బాలీవుడ్ ప్రేమ జంట రణబీర్-కత్రినాల విషయంలోనూ అదే జరిగింది. సల్మాన్ తో ప్రేమాయణం తర్వాత కత్రినా, దీపికతో లవ్ ఎఫైర్ అనంతరం రణబీర్ లు కొన్నాళ్లపాటు ప్రేమించుకొన్నారు. ఆ ప్రేమ వ్యవహారం కూడా ఎక్కువరోజులు సాగలేదు లెండి. రణబీర్ మోసం చేశాడన్న కోపంతో మళ్ళీ సల్మాన్ చెంతకు వెళ్లిపోయింది హీరోయిన్ కత్రినా కైఫ్. మన రోమాంటిక్ రణబీర్ ఏమో ఆలియా భట్ ను తన గర్ల్ ఫ్రెండ్ గా మార్చుకొని హ్యాపీగా ఉన్నాడు. రణబీర్-కత్రినా విడిపోయిన తర్వాత కూడా ఒక సినిమా కలిసి చేశారు.

ఇద్దరి మధ్య అంతా సెటిల్ అయ్యింది అనుకున్నారు జనాలు. కానీ.. ఇటీవల తన తాజా చిత్రం “భారత్” ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన కత్రినా ఆ సందర్భంలో తాను జీవితంలో నమ్మని వ్యక్తి ఎవరైనా ఉంటే అది రణబీర్ అని పేర్కొనడం చర్చనీయాంశం అయ్యింది. కత్రినా అలా అనేసింది అంటే రణబీర్ ఆమెను ఎంత ఇబ్బంది పెట్టి ఉంటాడు అనే విషయం అర్ధం చేసుకోవచ్చు.

Share.