పర్వాలేదనిపించింది కానీ.. రొటీన్ గానే సాగింది..!

శ‌ర్వానంద్ హీరోగా ప్రియాంకా అరుళ్ మోహ‌న్ హీరోయిన్ గా కిశోర్.బి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘శ్రీకారం’. ’14 రీల్స్ ప్ల‌స్‌’ బ్యాన‌ర్ ‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన లభించింది. వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ.. యువకులంతా వ్యవసాయం పై కూడా ఫోకస్ పెట్టాలనే థీమ్ తో ఆ టీజర్ సాగింది. ఇక మిక్కీ జె మేయర్ సంగీతంలో రూపొందిన పాటలకు కూడా మంచి స్పందన లభించింది.

దాంతో మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న విడుదల కాబోతున్న ‘శ్రీ‌కారం’ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. అది ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి : శర్వా, ప్రియాంక అరుళ్ మోహన్ ల లవ్ ట్రాక్ తో ట్రైలర్ మొదలైంది. అటు తరువాత హీరో ఒక ఐటీ ఉద్యోగం చేస్తున్నట్టు చూపించారు. బెస్ట్ ఎంప్లాయ్ అయినప్పటికీ అతను తన సొంత ఊరెళ్ళి.. వ్యవసాయాన్ని ఓ కొత్త పద్దతిలో చెయ్యాలని డిసైడ్ అవుతాడు.

ఈ నిర్ణయంతో అతని కుటుంబ సభ్యులు హర్ట్ అవుతారు. చివరికి అతను అనుకున్న లక్ష్యాన్ని ఎలా ఛేదించాడు అనేది మిగిలిన కథగా తెలుస్తుంది.లవ్,ఫ్యామిలీ, మెసేజ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో ట్రైలర్ ను తీర్చిదిద్దారు కానీ.. ‘మహర్షి’ ఛాయలు శతమానం భవతి ఛాయలు అలాగే కనిపిస్తున్నాయి. డైలాగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి :


ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.