శ్రీకారం క్లోజింగ్ కలెక్షన్స్..!

శ‌ర్వానంద్ ,ప్రియాంకా అరుళ్ మోహ‌న్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్రీకారం’. కిశోర్.బి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలయ్యింది. మొదటి షో నుండీ ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించలేకపోయింది. కొంతలో కొంత మొదటి రోజు పర్వాలేదు అనిపించినప్పటికీ.. ఆ తరువాత అదే జోరుని చూపించలేకపోయింది. పోటీగా సినిమాలు ఉండడం.. ఆ మరుసటి వారం నుండీ కొత్త సినిమాలు విడుదలవ్వడం వలన ‘శ్రీకారం’ పై మరింత భారం పడింది.దాంతో ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది.

ఇక ‘శ్రీకారం’ క్లోజింగ్ కలెక్షన్లను గమనిస్తే:

నైజాం   2.86 cr
సీడెడ్   1.66 cr
ఉత్తరాంధ్ర   1.21 cr
ఈస్ట్   0.74 cr
వెస్ట్   0.50 cr
గుంటూరు   0.99 cr
కృష్ణా   0.53 cr
నెల్లూరు   0.32 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   8.82 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   0.30 cr
ఓవర్సీస్   0.52 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   9.64 cr

‘శ్రీకారం’ చిత్రానికి 17.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 17.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం 9.64 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్లకు ఏకంగా 7.86కోట్ల నష్టాలను మిగిల్చిందని చెప్పొచ్చు. శర్వానంద్ కు ఇది వరుసగా 4వ డిజాస్టర్ కావడం గమనార్హం.

Click Here To Read Movie Review

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Share.