Sree Mukhi: ‘ఐ వజ్ బార్న్ అమేజింగ్’ అంటున్న శ్రీముఖి.. ఫోటోలు వైరల్..!

‘అదుర్స్’ షో తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన శ్రీముఖి…ఆ తరువాత ‘అదుర్స్ 2’ ‘మనీ మనీ’ ‘సూపర్ మామ్’ వంటి షోలలో యాంకర్ గా చేసి ప్రేక్షకులకు మరింతగా దగ్గరైంది. అయితే ‘పటాస్’ అనే షోతో స్టార్ యాంకర్ గా మారిపోయింది ఈ నిజామాబాద్ అమ్మాయి.ఆ షోలో నాన్ స్టాప్ పంచ్ లు వేస్తూ యూత్ కు మరింతగా దగ్గరయ్యింది. ‘రాములమ్మ’ స్టెప్పుతో .. ఆ పేరునే తన స్క్రీన్ నేమ్ గా మార్చేసుకుంది శ్రీముఖి. అంతకు ముందు ఈమె ‘జులాయి’ వంటి సినిమాలో నటించినా రాని గుర్తింపు ఈ షోల ద్వారా సంపాదించుకుంది. అటు తరువాత కూడా ‘నేను శైలజ’ ‘జెంటిల్ మెన్’ ‘సావిత్రి’ ‘మనలో ఒకడు’ వంటి సినిమాల్లో కూడా నటించింది. ఇక ‘బిగ్-బాస్ 3’ రియాల్టీ షో లో పాల్గొని తనలోని కొత్త కోణాన్ని కూడా చూపించింది.

ఇక సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇక ఈ రోజు శ్రీముఖి పుట్టినరోజు కావడంతో తన గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేసి తన అభిమానులను ఆకట్టుకుంటుంది. ‘ఐ వజ్ బోర్న్ అమేజింగ్’ అంటూ ఆటిట్యూడ్ తో కూడుకున్న కామెంట్ ను కూడా పెట్టింది. అంతేకాకుండా ‘అందరూ ఈ కరోనా సెకండ్ వేవ్ కాలంలో జాగ్రత్తగా ఉండాలని కూడా కోరింది’. ఇక శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Share.