రవితేజ సినిమాపై కన్నేసిన సోనూ!

విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన సోనూసూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనే చెప్పాలి. లాక్ డౌన్ లో అతడు చేసిన సేవలు అంత సులువుగా మర్చిపోలేం. ఇప్పటికీ తనవంతుగా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాడు. తన యాక్షన్స్ లో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు సోనూసూద్. అతడికి పెరిగిన క్రేజ్ కారణంగా దర్శకనిర్మాతలు సోనూని హీరోగా పెట్టి సినిమాలు చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది మేకర్లు సోనూని సంప్రదించారు.

అయితే ప్రస్తుతం అన్నీ చర్చల దశల్లోనే ఉన్నాయి. కాగా, సోనూసూద్ దృష్టి ఇప్పుడు ఓ తెలుగు సినిమాపై పడినట్లు తెలుస్తోంది. రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నాడు సోనూసూద్. రవితేజ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో సోనూ కనిపించనున్నారు. అంతేకాదు.. ఈ సినిమాను తన సొంత బ్యానర్ లో నిర్మించాలని సోనూ భావిస్తున్నాడు.

ప్రస్తుతం ‘క్రాక్’ నిర్మాత ఠాగూర్ మధుతో హిందీ రీమేక్ హక్కుల కోసం సంప్రదింపులు జరుపుతున్నాడు. అన్నీ కుదిరితే.. ‘క్రాక్’ రీమేక్ తో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు సోనూసూద్. ఇకపై సోనూ విలన్ గా కంటే హీరోగా ఎక్కువ సినిమాలు చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం విలన్ గా వస్తోన్న ఆఫర్లను పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకముందు తను అంగీకరించిన సినిమాలను మాత్రం పూర్తి చేస్తున్నాడు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.