‘సోలో బ్రతుకే సో బెటర్’ .. థీమ్ వీడియో బానే ఉంది కానీ..!

‘చిత్రలహరి’ ‘ప్రతీరోజూ పండగే’ వంటి రెండు హిట్లందుకున్న మెగా మేనల్లుడు సాయి తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని ‘ఎస్.వి.సి.సి బ్యానర్’ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక రేపు వాలెంటైన్స్ డే కాబట్టి ‘సోలో బ్రతుకే సో బెటర్’ థీమ్ వీడియోని రిలీజ్ చేశారు.

Solo Brathuke So Better Theme Video Review1

ఈ థీమ్ వీడియోలో కాలేజీ బ్యాక్ గ్రౌండ్ లో.. హీరో సాయి తేజ్ మెల్లగా అలా నడుచుకుంటూ .. బయట ఉన్న ఆడిటోరియం వద్దకు వద్దకు వచ్చి… వెనుక ఉన్న దివంగత నేత్రి జయలలిత, అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయ్, ఆర్.నారాయణ మూర్తి, మథర్ థెరిస్సా, అబ్దుల్ కలాం వంటి వారి కటౌట్ లకు నమస్కారం చేస్తాడు. వాళ్లంతా పెళ్ళిళ్ళు చేసుకోకుండా సింగిల్ గా ఉన్నారనేది .. మెయిన్ పాయింట్. ఇక అటు తరువాత మన హీరో ‘కోపం, ఇష్టం, విచారం, సంతోషం,ఆనందం, బాద .. ఇవన్నీ కాలాలతో పాటు , కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్.. ప్రేమ కూడా ఫీలింగే కదా గ్యారంటీ ఏంటి?’ అంటూ పెద్ద డైలాగ్ చెబుతాడు. రేపు వాలెంటైన్స్ డే కాబట్టి.. సింగిల్స్ కు మంచి స్టఫ్ ఇచ్చేలా ఈ థీమ్ వీడియో ఉంది. అయితే తమన్ మాత్రం ‘అల వైకుంఠపురములో’ థీమ్ మ్యూజిక్ ను యాజ్ ఇట్ ఈజ్ ఇందులో కూడా పెట్టేసాడు. దీంతో వరుస సినిమాలతో టైం లేకపోవడం వల్ల తమన్ అదే ట్యూన్ వాడేసినట్టున్నాడు.. అంటూ కామెంట్స్ మొదలయ్యాయి. ఓవరాల్ గా ఓకే అనిపిస్తుంది ఈ థీమ్ వీడియో. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Share.