‘సోలో బ్రతుకే సో బెటర్’ షూటింగ్ పూర్తయిపోయిందట…!

అరడజను ప్లాపులతో డీలా పడిపోయిన సాయి తేజ్… ‘చిత్రలహరి’ ‘ప్రతీ రోజూ పండగే’ చిత్రాలతో హిట్లందుకుని మళ్ళీ ఫామ్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే ఊపులో ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం చేసాడు. ‘ఎ.స్వి.సి.సి’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని నిర్మించగా నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కించాడు.తమన్ సంగీతంలో రూపొందిన ‘నో పెళ్లి’ ‘హే ఇది నేనేనా’ అనే పాటలు సినిమా పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసాయి.

కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవల తిరిగి ప్రారంభం అయ్యింది. అయితే కొద్దిరోజులకే ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అంటూ సాయి తేజ్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ‘వి’ తరహాలోనే ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని కూడా ఓటిటిలో విడుదల చెయ్యబోతున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే ‘ఈ చిత్రం షూటింగ్ ను మమ అనిపించేసారా?’ అనే డిస్కషన్లు కూడా మొదలయ్యాయి.

ఎందుకంటే ఇంకా ఈ చిత్రం షూటింగ్లో భాగంగా 2 పాటలను చిత్రీకరించాల్సి ఉందట. అయితే ఇంత త్వరగా ఆ రెండు పాటలను చిత్రీకరించేసారా అనేది కొంతమంది అనుమానం. ఇక ‘జి5’ లో ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Share.