సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ రివ్యూ!

హీరో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయమవుతున్నారు. శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్‌ 25న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. లాక్‌డౌన్ తరవాత థియేటర్లలో విడుదలవుతోన్న కాస్త పేరున్న సినిమా ఇదే కావడం విశేషం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

జనాలంతా కలిసి హీరో కటౌట్ ని తగలబెట్టే సీన్ తో ట్రైలర్ మొదలైంది. అలా ఎందుకో చేశారో తెలియాలంటే నా కథలోకి వెళ్లాలంటూ బ్యాక్ గ్రౌండ్ లో హీరో వాయిస్ వినిపిస్తుంది. స్టూడెంట్స్ అందరినీ ఒక దగ్గరకి చేర్చి వారందరికీ స్వేచ్ఛగా ఉండాలని చెబుతూ.. ప్రేమ, పెళ్లి అనే రిలేషన్స్ తో నాశనం చేసుకోవద్దంటూ క్లాస్ పీకుతుంటాడు హీరో. అలాంటి వ్యక్తి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. ట్రైలర్ లో వినిపించిన ఒకట్రెండు డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.

”సినిమా హాల్ లో ముందుకి, సిగరెట్ కి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తారు కదా.. అలాగే పెళ్లికి, పెళ్లానికి కూడా దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలి” అంటూ రావు రమేష్ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ట్రైలర్ మొత్తం ఫన్నీగా ఉండేలా కట్ చేశారు. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి!

Share.