బిగ్ బాస్ 4: సోహైల్ కోసం బిర్యాని వండిన చిరంజీవి భార్య..!

బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే దుమ్ములేచిపోయింది. సోహైల్ తీసుకున్న డెసీషన్ కి ఆడియన్స్ అందరూ ఫిదా అయిపోయారు. అంతేకాదు, టాప్ – 3 లో ఉండి తనకి ఓట్లు వేసి ఇంతవరకూ తీసుకుని వచ్చిన ఆడియన్స్ ప్రతి ఓటుని నేను వర్కౌట్ చేస్తాను అన్నట్లుగా 25లక్షలు తీసుకుని బయటకి వచ్చేశాడు సోహైల్. నిజంగా ఈ డెసీషన్ కి అక్కడున్న హౌస్ మేట్స్ అందరూ కూడా సెల్యూట్ చేశారు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి వచ్చినపుడు సోహైల్ ని ఉద్దేశ్యించి మాట్లాడుతుంటే సోహైల్ బాగా ఎమోషనల్ అయిపోయాడు.

అంతేకాదు, సోహైల్ నీకోసం మటన్ బిర్యానీ మా ఆవిడ సురేఖ స్పెషల్ గా చేసి మరీ పంపింది అనేసరికి భావోద్వేగాలని ఆపుకోలేకపోయాడు. నిజంగా నమ్మట్లేదా అయితే వీడియో చూడు అంటూ ఇంట్లో వండించి పెట్టిన బిర్యానీని చూపించాడు మెగాస్టార్ చిరు. అంతేకాదు, నీ ఎనర్జీ చాలా బాగుందని, సినిమాల్లో ఛాన్స్ కోసమే నీ కల అయితే నేను నీకు అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉంటానని చెప్పాడు. దీంతో సోహైల్ చిన్న సినిమా తీసినపుడు జస్ట్ నాకు సపోర్ట్ చేయండి సార్ చాలు అంటే,

అవకాశం ఇస్తే నీ సినిమాలో నేను యాక్టింగ్ కూడా చేస్తాను అన్నాడు చిరు. దీంతో సోహైల్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మెగాస్టార్ మనసుని గెలిచిన సోహైల్ తీసుకున్న డెసీషన్ తో అందరి హృదయాలు గెలిచాడు. అంతేకాదు, తను వాడే ఊతపదం నాకు బాగా నచ్చిందని వీలుంటే , నీ పర్మీషన్ ఇస్తే ‘నీ కథ వేరే ఉంటది’ అనే డైలాగ్ నా తర్వాత సినిమాలో వాడుకుంటానని చెప్పడంతో అందరూ చప్పట్లు కొట్టేశారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Share.