అభి క్రేజ్‌ చూసి పిచ్చెక్కుతుందన్న ‘మటన్‌’ సోదరులు

బిగ్‌బాస్‌ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టాప్‌ 5 కంటెస్టెంట్స్‌ చాలా బిజీగా గడుపుతున్నారు. అందులో అభిజీత్‌ టాప్‌లో ఉన్నాడనే చెప్పాలి. వరుస ఇంటర్వ్యూలతో హల్‌చల్‌ చేస్తున్నాడు. మరోవైపు సోహెల్‌ కూడా జోరు చూపిస్తున్నాడు. ఇటీవల మెహబూబ్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ ‘మటన్‌’ సోదరులు ఓ వీడియో చేశారు. అందులో అభిజీత్‌కు సోహెల్‌ ఓ ప్రాంక్‌ కాల్‌ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌ అయ్యింది. అందులో అభి కూల్‌నెస్‌ అయితే సూపర్.

అభిజీత్‌కు సోహెల్‌ ప్రాంక్‌ కాల్‌ చేసి ‘బాలీవుడ్‌ సినిమా ఆఫర్‌ ఉంది’ చేస్తారా అంటూ మాట్లాడాడు. కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నాక సోహెల్‌ అసలు విషయం చెప్పేశాడు. దానికి అభిజీత్‌ చాలా కూల్‌గా రియాక్ట్‌ అయ్యాడు. దానికి మరోసారి సోహెల్‌, మెహబూబ్‌ ఫిదా అయిపోయారు. అభి కూల్‌నెస్‌కు బిగ్‌బాస్‌ హౌస్‌లోనే వీళ్లు ఫ్యాన్స్‌ అనుకోండి. ఈ క్రమంలో అభికి సోహెల్, మెహబూబ్‌ థ్యాంక్స్‌ చెబుతూ ఓ సెల్ఫీ అడిగారు. సోహెల్‌ అయితే అభిని షైనింగ్‌ స్టార్ అంటూ పొగిడేశాడు.

ఓ ఆటోగ్రాఫ్‌ కూడా కావాలంటూ అడిగాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లో అనుకున్న ఫామ్‌ హౌస్‌ పార్టీ ఏమైంది అంటూ గుర్తు చేశాడు కూడా. ఏదేమైనా ఇంటి నుంచి బయటికొచ్చాక టాప్‌ 5 కంటెస్టెంట్స్‌ చాలా సరదాగా కనిపిస్తున్నారు కదా.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Share.