బిగ్ బాస్ 4: టాప్ – 5 లో మజా ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మెంబర్స్ జెర్నీలని చూపించాడు బిగ్ బాస్. వందరోజుల్లో వారి ప్రయాణాన్ని వాళ్లకి చూపించేటపుడు అందరూ కూడా భావోద్వేగాలకి గురి అయ్యారు. మొదటి నుంచి వాళ్లు గేమ్ ఆడిన తీరు, అలాగే వాళ్లు ఎదుర్కున్న సవాళ్లు, కొట్లాడిన పద్దతి ఇవన్నీ కూడా వాళ్లకి మంచి మజాని ఇచ్చాయి. అంతేకాదు, చూసే ప్రేక్షకులు సైతం వాటిని రీ కలక్ట్ చేసుకుని ఎక్కడ ఎవరు తప్పుచేశారు అనేది గ్రహిస్తారు. అప్పుడే వారికి ఓటింగ్ లో పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది.

ఈ జెర్నీలు చూడటం కేవలం హౌస్ మేట్స్ కోసమే కాదు, ఇంతవరకూ టాప్ – 5 లోకి వచ్చినవాళ్లు ఎంత కష్టపడ్డారు అనేది ఆడియన్స్ కి కూడా నోటీస్ అవుతుంది. టాప్ – 5 లో ఉండే మజానే ఇది. ఇందులో అభిజిత్, అఖిల్ జెర్నీలు ఒక ఎపిసోడ్ లో చూపిస్తే, హారిక – సోహైల్, అరియానాల జెర్నీలు ఇంకో ఎపిసోడ్ లో చూపించారు. ఇందులో హారిక జెర్నీ చూస్తుంటే తను ఎంత కష్టపడి టాస్క్ లు ఆడిందో ఇప్పుడు ఆడియన్స్ కి నోటీస్ అయ్యింది. అలాగే తర్వాత సోహైల్ జెర్నీలో ఎక్కడా ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా కనిపించింది. ప్రతిరోజూ ఫ్రెష్ గా స్టార్ట్ చేయడం, టాస్క్ లలో ఎగ్రెసివ్ గా దూసుకుపోవడం, ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఎనర్జీతో ఉండటంతో ఆడియన్స్ సోహైల్ ఎనర్జీకి ఫిదా అయిపోయారు.

తర్వాత అరియానా జెర్నీలో కూడా హైలెట్స్ చూపించారు. తను ముక్కుసూటిగా మాట్లాడటం, ప్రతి టాస్క్ లో ఎగ్రెసివ్ గా ముందుకు వెళ్లడం, అలాగే నామినేషన్స్ లో ఆర్గ్యూమెంట్స్ ఇలా అన్నీ కూడా అరియానాకి పాజిటివ్ గా అయ్యాయి. ఈ ముగ్గురి జెర్నీ చూసిన తర్వాత ఇంకా ఓటింగ్ కి టైమ్ ఉంది కాబట్టి మరి వీళ్ల ఓటింగ్ గ్రాఫ్ అనేది ఎలా ఛేంజ్ అవుతుంది అనేది చూడాలి. అదీ విషయం.

Share.