బన్నీ, త్రివిక్రమ్ సినిమాకే అదే హైలెట్ అంట..?

అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది. త్రివిక్రమ్ చిత్రాల్లో ఎమోషనల్ కంటెంట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ చిత్రంలో కూడా ఎమోషనల్ కంటెంట్ కాస్త ఎక్కువగానే ఉంటుందట. బన్నీ కోసం మొదట ఫాదర్ సెంటిమెంట్ కథ రాసినా… అందులో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి ఛాయలు ఎక్కువ ఉఉండడంతో ఇప్పుడు సిస్టర్ సెంటిమెంట్ గా మార్చాడట. రెగ్యులర్ సినిమాల్లో లాగా రెండు ఎమోషనల్ సీన్స్, నాలుగు డెప్త్ డైలాగ్ లతో చెల్లి సెంటిమెంట్ ను పండించడం కాకుండా.. ఇన్సిడెంట్స్ రూపంలో మొత్తం కథే చెల్లి పాత్ర పై ఉంటుందట.

ఇక అల్లు అర్జున్ ను కూడా త్రివిక్రమ్ డిఫరెంట్ గా చూపించబోతున్నాడట. బన్నీ డ్రెసింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ చాలా కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్, నవదీప్ లు కూడా నటిస్తున్నారు. హాట్ హీరోయిన్ టబు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Share.