హీరోయిన్ అయితే ప్రశాంతతను కోల్పోతారా..?

‘గులాబీ’ సినిమాలో ‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో’ అనే పాటతో ఇండస్ట్రీ సింగర్ గా అడుగుపెట్టింది సునీత. ఈ పాట సూపర్ సక్సెస్ అవ్వడంతో సునీతకి మంచి క్రేజ్ ఏర్పడింది. అద్భుతమైన వాయిస్ మాత్రమే కాదు.. అందమైన రూపంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. ఆ సమయంలో సునీతకు హీరోయిన్ గా కూడా అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె మాత్రం అంగీకరించలేదు. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రమే ఆమె ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఇటీవల సునీత రెండో వివాహం చేసుకొని మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వూలో హీరోయిన్ గా అవకాశాలను తిరస్కరించడంపై సునీత కొన్ని కామెంట్స్ చేసింది. సింగర్ గా కెరీర్ మొదలైనప్పుడే హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా కాదన్నారు.. ఇప్పుడిస్తే చేస్తారా..? అని సునీతను ప్రశ్నించగా.. దానికి ఆమె ‘ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని అనవసరంగా మార్చడం ఎందుకని.. ఇప్పుడంతా బాగానే ఉంది కదా’ అని చమత్కరించారు.

తన అభిప్రాయాన్ని నేరుగా చెప్పకుండా.. సునీత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సునీత దృష్టిలో హీరోయిన్ కావడమంటే ప్రశాంతతను కోల్పోవడమేనన్న మాట అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఏ విధంగా ప్రశాంతతను కోల్పోతారో చెప్తే.. హీరోయిన్ కావాలనుకునే వారికి మేలు చేసినట్లవుతుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.