తన భర్త వల్ల స్టేజి పైనే ఎమోషనల్ అయిన సింగర్ సునీత..!

సింగర్‌ సునీత జనవరి 9న ‘మ్యాంగో మీడియా’ అధినేత రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయం పై చాలా రోజులు చర్చ కూడా జరిగింది. పెళ్లీడుకి వచ్చిన ఇద్దరు పిల్లలను పెట్టుకుని ఈ టైములో రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ కొందరు నెటిజెన్లతో పాటు క్రిటిక్స్ కూడా సునీత పై విమర్శలు గుప్పించారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే.. అది ఆమె పర్సనల్ వ్యవహారం అని.. రోజా వంటి కొందరు సినీ సెలబ్రిటీలు సునీతను వెనకేసుకొచ్చారు.

మొత్తానికి వీరిద్దరూ ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ‘స్టార్‌ మా’ వారు నిర్వహిస్తున్న `100%లవ్‌` షోలో పాల్గొని ప్రేమ గీతాలు ఆలపించింది సునీత. ఈ నేపథ్యంలో తన సునీత.. తన భర్త రామ్‌ కు ఐ లవ్‌ యూ చెప్పింది. ‘మాది చాలా మెచ్యూర్డ్ లవ్‌’ అంటూ చెప్పింది. అంతేకాకుండా నాకు ఎమోషనల్‌గా, ఆనందంగా ఉందని కూడా తెలియజేసింది. అంతేకాదు రామ్ తో అసలైన ప్రపంచాన్ని చూడాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చి ‘ఈ వేళలో నీవు’ అనే పాటని అతని కోసం పాడడం మొదలుపెట్టింది.

ఈ లోగా సడెన్ గా స్టేజిపైకి ఎంట్రీ ఇచ్చాడు రామ్. అలాగే సునీతకి ఓ ఫ్లవర్‌ ఇచ్చి ఐ లవ్‌ యూ కూడా చెప్పాడు. ‘1995 నుండీ సోషల్‌ మీడియాలో వర్క్ చేస్తున్నాము, అప్పటి నుండే మాకు పరిచయం ఉంది. కొద్దిరోజుల తర్వాత మ్యారేజ్‌కి అప్లై చెయ్యడం మొదలుపెట్టాను.కానీ రిప్లై రాలేదు, మొన్నటి దాకా’ రామ్ చెబుతుండగా.. ‘ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నానో, అప్పుడే చెప్పాను `యెస్‌` అని అంటూ సునీత చెప్పుకొచ్చింది. తరువాత రామ్ ను హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యింది.

సునీత-రామ్ వీరపనేనిల పెళ్లి ఫొటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39


Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.