పెళ్లికి ముందు పరిస్థితుల గురించి సునీత కామెంట్స్‌!

పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా సునీత దాటేసేవారు. అయినా ఆమె పెళ్లి గురించి వార్తలు వినిపిస్తూనే ఉండేవి. ఆమె ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా వినిపించే మొదటి ప్రశ్నల్లో ఆమె పెళ్లి ప్రస్తావన వచ్చేది. ప్రతిసారి ఆమె ‘లేదు’ అంటూ సమాధానమిచ్చేవారు. ‘ఓకే2 అంటూ అభిమానులు అనుకుంటున్న సమయంలో ‘మా అమ్మ పెళ్లి’ అంటూ సునీత ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజులు పెళ్లి అయిపోయింది. మరి ఆ గ్యాప్‌లో ఏం జరిగింది అని అనుకుంటున్నారు. దీనికి సమాధానం ఈ రోజు లభించబోతోంది.

సునీత‌ – రామ్‌ పెళ్లి అయిన తర్వాత తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పెళ్లి గురించి, నాటి పరిస్థితుల గురించి చెప్పారని తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూని చేసింది సుమ. ఇందులో పెళ్లికి సంబంధించి చాలా విషయాలు చెప్పుకొచ్చారట. ఆ వీడియో ప్రోమోలో సుమ చెప్పిన విషయం ఒకటి ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు ఆమె మాటలు వైరల్‌ అవుతున్నాయి. ‘‘నిజానికి పెళ్లికి తాను సిద్ధంగా లేనని, అయితే, లాక్‌డౌన్‌ సమయంలో ఏదో జరిగింది’ అంటూ చెప్పుకొచ్చింది సునీత. అంతేకాదు పెళ్లికి ముందు కలిసినప్పుడు ఇద్దరూ ఏం మాట్లాడుకునేవారో కూడా చెప్పుకొచ్చింది.

సునీత సోషల్‌మీడియా ఖాతాలను రామ్‌ టీమ్‌ చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎప్పుడైనా సునీత.. రామ్‌ను కలిస్తే, ‘ఇంకేటి’ అనేవారట. ఆ సమయంలో తనకు ఏం మాట్లాడాలో తెలిసేది కాదని సునీత ప్రోమోలో చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆ ఇంటర్వ్యూలో సునీత మరో సరదా విషయం కూడా చెప్పుకొచ్చారు. పెళ్లి సమయంలో ఉంగరం ఆటలో చీటింగ్‌ జరిగింది అంటూ సరదాగా చెప్పుకొచ్చారు సునీత. పెళ్లికి వచ్చిన మహిళలందరూ తన చేయి వెనక్కి లాగేశారని చెప్పుకొచ్చారు.


ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.