అలా అనుకుంటే అది మీ మూర్ఖత్వమే : సింగర్ స్నిగ్ద

‘అలా మొదలైంది’ ‘రొటీన్ లవ్ స్టోరీ’ అంతకు ముందు ఆ తరువాత’ ‘గుంటూరు టాకీస్’ తాజాగా ‘ఓ బేబీ’ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది సింగర్ స్నిగ్ధ. ఆమె సింగర్ గా కూడా చాలా ఫేమస్ అయ్యింది. అయితే చూడటానికి.. ఈమె హెయిర్ కట్ చేయించుకుని.. ఫాంట్, షర్ట్ వేసుకుని ఉండడం వలన ఈమె కాస్త అబ్బాయిలా కనిపిస్తుంటుంది. సినిమాల్లో కూడా ఈమెకు అలాంటి పాత్రలే ఇస్తుంటారు. బయట ఎలా ఉన్నా కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈమె పై కామెంట్లు చేస్తూనే వస్తున్నారు. ఈమధ్య ఇది మరింత పెరిగింది. ఈమె పూర్తిగా అబ్బాయిలా మారిపోయిందని.. రక రకాల కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో ఈమెను ట్రోల్ చేస్తున్నారు.

singer-actress-singdha

తాజాగా తన పై వస్తున్న ట్రోల్స్ కు అలాగే.. పుకార్లకు ఈమె క్లారిటీ ఇచ్చింది. స్నిగ్ధ మాట్లాడుతూ.. ‘ దేవుడు నన్ను అమ్మాయిలా సృష్టించాడు. నాకు మంచి గొంతు కూడా ఇచ్చాడు. సింగర్ గా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి.. అలాంటప్పుడు నేను అబ్బాయిగా మారడానికి ఎందుకు ప్రయత్నిస్తాను? అమ్మాయి కాస్తా.. అబ్బాయిగా మారాలంటే అదేమీ మంత్రం వేసినంత ఈజీ కాదు. అయినా నేనెందుకు అబ్బాయిలా మారాలి. నేను అబ్బాయిలా మారతానని ఎవరైనా అనుకుంటే అది వారి మూర్ఖత్వమే..! ఎవరో ఏదో అనుకుంటే నాకు పోయేదేమీ లేదు’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది.

Share.