శ్యామ్ కె.నాయుడికి సినిమా చూపిస్తున్న శ్రీసుధ

అప్పటివరకూ చాలా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినప్పటికీ “అర్జున్ రెడ్డి”లో రోమాంచితమైన చిన్న సన్నివేశంలో నటించిన తర్వాతే శ్రీసుధకు నటిగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత కూడా ఆమెకు చెప్పుకోదగ్గ పాత్రలు రాకపోయినప్పటికీ.. విరివిగా సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే.. గతేడాది తనను ఛోటా కె.నాయుడు తమ్ముడు శ్యామ్ కె.నాయుడు పెళ్లి చేసుకుంటానని చాన్నాళ్లపాటు ఫిజికల్ గా, మెంటల్ గా వాడుకొని వదిలేశాడంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బాంబు పేల్చింది.

ఆ కేస్ అనంతరం కొన్ని యూట్యూబ్ చానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ విషయం ఛోటా కె.నాయుడికి కూడా తెలుసని, ఆయన కూడా ఈ విషయాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనం సృష్టించింది. అయితే.. అంతా సెటిల్ అయిపోయింది అనుకున్న తరుణంలో శ్రీసుధ కారుపై కొందరు దుండగులు దాడి చేయడం, వెంటనే ఆమెకు ప్రాణ హాని ఉందంటూ మళ్ళీ శ్యామ్ కె.నాయుడుపై కేస్ పెట్టడం సరికొత్త సంచలనానికి దారితీసింది.

ఈ విషయమై తెలంగాణ హైకోర్ట్ శ్యామ్ కె.నాయుడు మరియు పోలీసులను వివరణ ఇవ్వాల్సిందిగా సమన్లు జారీ చేసింది. ఒక చిన్న చీటింగ్ కేస్ నుంచి అటెంప్ట్ టు మర్డర్ దాకా శ్రీసుధ కేసు తీసుకున్న టర్నింగ్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మొత్తానికి శ్రీసుధ మాత్రం శ్యామ్ కె.నాయుడికి సినిమా చూపిస్తోంది. మరి ఛోటా కె.నాయుడు ఈ ఇష్యూని ఎలా సెటిల్ చేస్తాడో చూడాలి.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.