కొత్త బంగారు లోకం హీరోయిన్.. గ్రాండ్ బర్త్ డే పార్టీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న భామలు చాలా వరకు మినిమమ్ ఐదారేళ్లయినా స్టార్ హీరోయిన్ గా బిజీగా ఉంటారు. అయితే కొందరు మాత్రం ఆ ఒక్క సినిమా వరకే గుర్తుంటారు. తరువాత ఎన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తుండరు. అలాంటి బ్యూటీలలో శ్వేతాబసు ప్రసాద్ ఒకరు. ఈ బ్యూటీ మొదటి సినిమా గురించి అందరికి తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్ లో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన కొత్త బంగారు లోకం సినిమా 2008లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది.

బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా అంధించిన లాభాలు అన్ని ఇన్ని కావు. ఇక ఆ సినిమాలో నటించిన హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ పక్కా స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ అమ్మడి బ్యాడ్ లక్ ఏమిటో గాని ఆ తరువాత పెద్దగా అవకాశాలు అందుకోలేదు. కెరీర్ గాడి తప్పడంతో పాటు ఆమె అనుకోని విధంగా కొన్ని సమస్యల్లో ఇరుక్కోవడం ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ఇక ఇటీవల ముంబైలో అమ్మడు కొంతమంది బాలీవుడ్ సెలబ్రెటీల సమక్షంలో తన 30వ పుట్టినరోజును జరుపుకుంది.

అందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక ఆ ఫొటోలను చూసిన వారు అప్పుడే ఈ హీరోయిన్ మూడు పదుల వయసులోకి వచ్చేసిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.