శ్రుతిహాసన్ పెళ్ళికి సరేనన్న కమల్ హాసన్

“క్రాక్”తో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రుతిహాసన్ ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతోంది. ఆల్రెడీ తమిళంలో విజయ్ సేతుపతి సరసన “లాభం” అనే సినిమాలో నటించింది త్వరలోనే ప్రభాస్ సరసన “సలార్”లో సందడి చేయనుంది. ఇక ఆమె కెరీర్ మళ్ళీ గాడినపడినట్లే అని ఆమె అభిమానులందరు సంబరపడుతున్న తరుణంలో మరో బాంబు పేల్చింది తమిళ మీడియా. ఓ ఫారిన్ ఫోటోగ్రాఫర్ తో కొన్నాళ్లపాటు డేటింగ్ & లివ్ ఇన్ లో ఉన్న శ్రుతిహాసన్ అనంతరం అతనితో బ్రేకప్ చెప్పి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే.. ఆ రిలేషన్ ఇంకా ఇంటర్నెట్ లో నానుతుండగానే మరో రిలేషన్ షిప్ కి తెరలేపింది శ్రుతి. శ్రుతి ప్రస్తుతం ఫేమస్ ఆర్ట్ డెవలపర్ శంతను హజారికాతో డేటింగ్ చేస్తోంది. ఈమేరకు వాళ్ళు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వనప్పటికీ.. వాళ్ళు హ్యాపీగా కలిసి పబ్లిక్ గా తిరుగుతున్న ఫోటోలు చూస్తే విషయం అందరికీ అర్ధమవుతుంది. అయితే.. ఇటీవల 35వ పడిలోకి ఎంటరైన శ్రుతిహాసన్ కు వయసు గుర్తుచేస్తూ త్వరగా పెళ్లి చేసుకోమని వారించాడట కమల్ హాసన్.

ఆల్రెడీ శంతను గురించి తెలిసిన కమల్.. అన్నీ కుదిరితే అతడిని వచ్చే ఏడాది పెళ్లి చేసుకోమని చెప్పేశాడట. అందుకే శ్రుతిహాసన్ “సలార్” మినహా మరో ప్రొజెక్ట్ ఒకే చేయడం లేదట. మరి ఈసారైనా శ్రుతి లవ్ స్టోరీ పెళ్లిపీటల వరకు వస్తుందో లేదో చూడాలి.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.