బాలకృష్ణ సినిమాకి నొ చెప్పింది.. మళ్ళీ అదే సమస్య..!

ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలకు హీరోయిన్లను వెతకడం దర్శకనిర్మాతలకు పెద్ద తలనొప్పి అయిపోయింది. ముఖ్యంగా మన నందమూరి బాలకృష్ణకి అయితే మరీను..! ఆయన సరసన నటించడానికి హీరోయిన్లు తొందరగా ఒప్పుకోవడం లేదు. బహుశా ఆయన మాస్ సినిమాలు చేస్తాడు కాబట్టి.. హీరోయిన్ కు అందాలు ఆరబొయ్యడం తప్ప మరో పని ఉండదు అందుకే.. ఇతని సినిమాల్లో నటించడానికి హీరోయిన్లు వెనుకడుగు వేస్తారనుకుంట. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే..

ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో సినిమా చేస్తున్న బాలయ్య ఆ తరువాత ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణకు హీరోయిన్ ను వెతకడం అతనికి కూడా ఇబ్బందిగా మారిందట. ఈ మధ్యనే అతను బాలకృష్ణ సినిమా కోసం శృతీ హాసన్ ను సంప్రదించగా ఆమె మొహమాటం లేకుండా నొ చెప్పేసిందట.

చాలా కాలం తరువాత ‘క్రాక్’ తో రీ ఎంట్రీ ఇచ్చిన శృతీ హాసన్ కు పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి బడా స్టార్ల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఎలాగైనా ఆమె తిరిగి స్టార్ స్టేటస్ ను దక్కించుకోవాలని కష్టపడుతుంది.అందుకే ఏమాత్రం ఫామ్లో లేని బాలయ్య సినిమాలో నటించడానికి ఆమె సిద్ధంగా లేదని సమాచారం. ఇక శృతీ నొ చెప్పడంతో మరో హీరోయిన్ ను వెతికే పనిలో దర్శకుడు గోపి ఉన్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.