బోల్డ్ డెసిషన్ తీసుకున్న శ్రద్దా కపూర్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘సాహో’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రద్దా కపూర్. ఈ చిత్రంలో ఈమె అమృత అనే పాత్రలో నటించింది. క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ గా మంచి నటన కనబరచడంతో పాటు గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది శ్రద్దా కపూర్. దాంతో తెలుగులో కూడా ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడిందనే చెప్పాలి. దాంతో తెలుగు సినిమాల్లో కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి.

‘మంచి కథ అలాగే అందులో నా పాత్ర నచ్చితే.. కచ్చితంగా తెలుగు సినిమాల్లో నటిస్తాను’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అలాగే ‘ఎన్టీఆర్ -త్రివిక్రమ్’ ప్రాజెక్టు లో ఈమె నటిస్తుంది.. అంటూ వార్తలు వచ్చాయి కానీ.. అందులో నిజం లేదని ఇన్సైడ్ టాక్. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే.. తాజాగా శ్రద్ధా కపూర్ నagగా నటించడానికి కూడా రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. తమిళంలో అమలా పాల్ నటించిన ‘ఆడై'(తెలుగులో ఆమె) చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారట. తమిళ్ లో డైరెక్ట్ చేసిన రత్నకుమారే.. ఈ రీమేక్ ను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. కథ ప్రకారం ఈ చిత్రం సెకండ్ హాఫ్ లో శ్రద్దా కపూర్ నagగా నటించాల్సి ఉంటుంది. దీనికి శ్రద్ధా ఏమాత్రం భయపడకుండా ఓకే చెప్పేసిందని సమాచారం.

Most Recommended Video

నిహారిక-చైతన్య నిశ్చితార్ధ వేడుకలో మెగాహీరోల సందడి..!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Share.