ఇన్ని రోజులకి అసలు క్లారిటీ ఇచ్చిన ‘సాహో’ బ్యూటీ..!

ప్రస్తుతం ఇండియన్ స్టార్ షట్లర్ అనగానే మనకి గుర్తొచ్చే పేరు సైనా నెహ్వాల్. ఆమె అనేక అంతర్జాతీయ వేదికల పై ఘన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు విజయాలతో ఇంత కీర్తిని సంపాదించుకున్న నేహా జీవితంలో చాలా ట్రాజెడీ ఉందట. అందుకే ఆమె జీవితాన్ని బయోపిక్ తీస్తున్నారు బాలీవుడ్ సినీ దర్శక నిర్మాతలు. ’సైనా’ అనే పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సైనా నెహ్వాల్ పాత్రను పరిణీతి చోప్రా చేస్తుంది. అమోల్ గుప్తే డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు.

shraddha-kapoor-reveals-why-she-is-out-from-saina-nehwal-biopic1

నిజానికి ఈ చిత్రంలో మొదట ‘సాహో’ భామ శ్రద్దా కపూర్ ను సైనా నెహ్వాల్ పాత్ర కోసం అనుకున్నారు. ఈ చిత్రం కోసం కొన్నిరోజులు నిపుణుల పర్యవేక్షణలో కూడా ఆమె శిక్షణ తీసుకుంది. కానీ ఏమైందో ఏమో తెలీదు… సడన్ గా ఈ ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకోవడం పెద్ద సంచలనమయ్యింది. దీనికి అసలు కారణం ఆమె ‘సాహో’ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చింది. ‘కేవలం డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వలనే ఆ బయోపిక్ నుండీ తప్పుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Share.