గది మొత్తం ఆయన ఫోటోలతో నిండిపోయింది : శ్రద్ధాకపూర్

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న శ్రద్ధా కపూర్ సాహో సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. సాహో సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా శ్రద్ధా కపూర్ కు మాత్రం నటిగా మంచి పేరు వచ్చింది. స్టార్ కుటుంబంలో పుట్టినా కొంచెమైనా గర్వం లేని శ్రద్ధాకపూర్ పాకెట్ మనీ కోసం కేఫ్ లో పని చేశారు. చదువుకునే రోజుల్లో ఎవరిపై ఆధారపడకూడదనే ఉద్దేశంతో శ్రద్ధాకపూర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

కెరీర్ తొలినాళ్లలోనే శ్రద్ధాకపూర్ నటించిన భాఘీ, ఏక్ విలన్, ఆషికి 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లైన సంగతి తెలిసిందే. సైకాలజిస్ట్ కావాలని అనుకున్న శ్రద్ధాకపూర్ బోస్టన్ యూనివర్సిటీలో ఉన్నత చదువుల కోసం చేరారు. అక్కడ చదువుకునే సమయంలోనే శ్రద్ధాకపూర్ పార్ట్ టైమ్ జాబ్ చేశారు. చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే శ్రద్ధాకపూర్ కు ఆసక్తి ఎక్కువ. టైటానిక్, గాడ్ ఫాదర్ సినిమాలను ఆమె ఎక్కువసార్లు వీక్షించారు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన కహోనా ప్యార్ హై సినిమా అంటే శ్రద్ధాకపూర్ కు ఎంతో ఇష్టం.

ఈ సినిమా విడుదలైన సమయంలో శ్రద్ధాకపూర్ ఏ పేపర్ లో హృతిక్ ఫోటోలు కనిపించినా ఆ ఫోటోలను కత్తిరించి బెడ్ రూమ్ లోని గోడలకు అతికించేవారు. అలా చేయడం వల్ల గది మొత్తం హృతిక్ ఫోటోలతో నిండిపోయిందని శ్రద్ధాకపూర్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. బాలీవుడ్ లో ఎకువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ శ్రద్ధాకపూర్ అని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు. అయితే శ్రద్ధాకపూర్ తన రెమ్యునరేషన్ గురించి స్పందిస్తూ నటికి ఉన్న డిమాండ్ ను బట్టి రెమ్యునరేషన్ ఇస్తారని.. తాను ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటానో ఇతరులకు తెలియజేయాల్సిన అవసరం లేదని ఒక సందర్భంలో చెప్పారు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.