సర్కారి వారి ప్లానింగ్ మారుతోందా..?

సంక్రాంతి పొంగల్ కి కాస్త గ్యాప్ ఇచ్చినా కూడా సర్కారు వారి పాట సినిమా ధనా ధన్ కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. డైరెక్టర్ పరుశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కతున్న ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ని ఫటా ఫట్ ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈసినిమాలో కొంత పార్ట్ ని అమెరికాలో షూట్ చేయాల్సి ఉంది. దీనికోసం యూఎస్ లో షూటింగ్ ప్లాన్ చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ లోనే ఆ సీన్స్ ని కంప్లీట్ చేసేలా సెట్ వర్క్ చేసుకున్నారు.

అంతేకాదు, ఈ షెడ్యూల్ తర్వాత దుబాయ్ లో కూడా కొన్ని కీలకమైన సీన్స్ ని తీసేందుకు ప్లాన్ చేశారు. జనవరి ఎండింగ్ లో దుబాయ్ కి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు కూడా వినిపించాయి. అయితే, ఇప్పుడు ఆ అవసరం లేకుండానే హైదరాబాద్ లోనే షూటింగ్ ని కంప్లీట్ చేసేయాలని చూస్తోందట మూవీ టీమ్. కీర్తి సురేష్ హీరోయన్ గా చేస్తున్న ఈసినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ ని హైదరాబాద్ లోనే షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

దీనికి సంబంధించి సెట్స్ ని కూడా నిర్మిస్తున్నట్లుగా సమాచారం. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈసినిమాని 14రీల్స్ , మైత్రీ మూవీ మేకర్స్ , మహేష్ బాబు బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.