ఆ విషయంలో పూజా అడ్డంగా దొరికిపోయింది

మనకు రాని దానిని పది మందిలో ప్రదర్శించకపోతేనే మంచిది.కాదని మూర్ఖంగా ఎవరో అడిగారని ముందుకు వెళితే ఇలానే అబాసు పాలు కావాల్సివస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది పూజ హెగ్డే. ఇటీవల వైజాగ్ వేదికగా అల వైకుంఠపురంలో సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో తల్లిదండ్రులతో పాటు పాల్గొంది పూజా హెగ్డే. అల వైకుంఠపురంలో చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాలలో తరచుగా పొట్టి గౌనులలో పాల్గొన్న పూజా ఈ వేడుకకు మాత్రం నిలువెత్తు చీరలో సంప్రదాయంగా హాజరైంది.

Shoking Trolls on actress Pooja Hegde

కాగా మూవీ సక్సెస్ గురించి మాట్లాడటానికి వేదికపైకి వెళ్లిన పూజ, అల వైకుంఠపురంలో చిత్రంలోని బ్లాక్ బస్టర్ సాంగ్ సామజవరగమనా సాంగ్ పాడటం మొదలుపెట్టింది. వెనుకే ఉన్న థమన్ ఆమె పాటకి తగ్గట్టుగా బీట్ అందుకున్నాడు.ఐతే ఆమె పాటకు, ఈయన బీటుకు పొంతన లేకపోవడంతో నవ్వాలో ఏడవాలో థమన్ కి అర్థం కాలేదు. నాలుక తిరగని తెలుగు పాదాలను నమిలేస్తూ…శృతిని చంపేసి ఆమె పాడిన తీరుకు సభ మొత్తం స్థంభించిపోయింది. పూజ పాటవిన్నాకా ఆమె పేరెంట్స్ కి తెలుగు పాటపై ఉన్న మంచి అభిప్రాయం పోయింది అనిపించింది, వారి ముఖాలు చూస్తే.ఇక ఇదే విషయంపై పూజా ని నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.వాళ్లకు నచ్చిన విధంగా మీమ్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.


సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.