మంచి టి.ఆర్.పి రేటింగ్ ను సాధించిన ‘క్రాక్’ మూవీ..!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్’ మూవీ టీవీల్లో కూడా అదరగొట్టింది. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మించాడు. శృతీ హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. కాగా ‘రాజా ది గ్రేట్’ తరువాత రవితేజ చేసిన ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ‘డిస్కో రాజా’ వంటి చిత్రాలు వరుసగా డిజాస్టర్లు అయ్యాయి.

దాంతో రవితేజ పని అయిపోయింది అనుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ.. ‘క్రాక్’ ఫలితాన్ని చూసి నోటిమీద వేలు వేసుకున్నారనే చెప్పాలి. ఇక థియేటర్లలోనే కాదు టీవీల్లో కూడా ‘క్రాక్’ మూవీ సూపర్ హిట్ అవ్వడం విశేషం. ఇటీవల ‘క్రాక్’ చిత్రాన్ని ‘స్టార్ మా’ లో టెలికాస్ట్ చెయ్యగా ఏకంగా 11.71 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. ‘క్రాక్’ శాటిలైట్ రైట్స్ ను ‘స్టార్ మా’ వారు రూ.8 కోట్లకు కొనుగోలు చేశారట.

దాంతో మొదటిసారి టెలికాస్ట్ చేసినప్పుడే వీరికి పెట్టిన మొత్తం వచ్చేసినట్టు తెలుస్తుంది.ఇక నుండీ టెలికాస్ట్ చేస్తే వచ్చేదంతా కూడా వారికి ప్రాఫిట్ అన్న మాట. థియేటర్లలో విడుదలై లాంగ్ రన్ నడిచినా.. అటు తరువాత ‘ఆహా’ ఓటిటిలో కూడా విడుదలైనా కూడా.. టీవీల్లో బాగానే చూసారని తెలుస్తుంది. ఇలా థియేట్రికల్ పరంగా.. డిజిటల్ పరంగా టి.ఆర్.పి ల పరంగా కూడా రవితేజ సూపర్ హిట్ అందుకోవడం అతని ఫ్యాన్స్ ఆనందించే విషయం అని చెప్పాలి.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Share.