70 ఏళ్ళ వయసులో కండలు.. ఎలా?

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘దర్బార్’. స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నఈ చిత్రానికి సంబంధించి తాజాగా సెకండ్ లుక్ ని విడుదల చేశారు. ఈ లుక్ లో రజినీ బ్లాక్ కలర్ బనియన్ లో రెండు చేతులతో రాడ్‌ను పట్టుకుని కోపంగా పైకిలేస్తున్నట్లుగా ఉంది. అయితే ఈ లుక్ ప్రస్తుతం వైరల్ అవుతున్నప్పటికీ… రజిని పై ట్రోలింగ్ జరుగుతుంది.

rajinikanth-darbar-movie-poster

‘ఏడు పదుల వయసు మీద పడుతున్నప్పుడు.. అంతటి టోన్డ్ కండరాలు ఎవ్వరికీ ఉండవు, అసలు ఆయనకి లేని మజిల్స్ ను చూపించాలని ఫొటోషాప్ చేసి అభిమానులను మోసం చేయడం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రజినీ అభిమానులు మాత్రం అలా కామెంట్లు పెట్టేవారిని తిట్టి పోస్తున్నారు. దీంతో వారికి రజినీ అభిమానులకు మధ్య సోషల్ మీడియాలో ఘర్షణ మొదలైంది. ఇక ‘దర్బార్’ లో రజినీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. రజినీ మనవడు ‘పేట’ చిత్రం తర్వాత మరోసారి ‘దర్బార్’ కు సంగీతం ఆదిస్తున్నాడు.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.