మైండ్ బ్లాక్ పాటపై నెగిటివ్ రియాక్షన్స్ ఎక్కువవుతున్నాయి

ఒక చెడు జరిగిన ఇంట్లోనే.. అందరూ బాధపడరు. అలాంటిది సమాజంలో ఎక్కడో జరిగిన చెడుకి మహేష్ ను బాధపడుతూ కూర్చోమని ఎవరూ అడగలేదు, అడగరు కూడా. కానీ.. దిశా అత్యాచారం మరియు హత్యోదంతం పార్లమెంట్ తో సహా ప్రపంచం మొత్తాన్ని దహిస్తున్న తరుణంలో మహేష్ & టీం “సరిలేరు నీకేవ్వరు” చిత్రం నుండి మొన్న సోమవారం ‘మైండ్ బ్లాక్” అనే పాటను విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటకు ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు. ఎప్పట్లానే దేవి పాత పాటల రీమిక్స్ అనే టాక్ కూడా వచ్చింది.

Mind Block's Song Review Sarileru Neekevvaru Movie1

ఈ ట్రోలింగ్స్ అన్నీ పక్కన పెడితే.. పాటలోని “అమ్మ అబ్బా అయ్యో” అని లేడీ వాయిస్ తో వచ్చే సెక్సిస్ట్ వోకల్స్ కి మాత్రం కొందరు మండిపడుతున్నారు. అసలే సినిమాల వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి అని జనాలందరూ దుమ్మెత్తిపోస్తున్న తరుణంలో.. మహేష్ ఇలాంటి డబుల్ మీనింగ్ సాంగ్ రిలీజ్ చేయడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తుంటే.. కనీస స్థాయి బాధ్యత లేదని ఇంకొందరు తిడుతున్నారు. ఇవన్నీ చూశాక మొదటి పాటగా ఈ “మైండ్ బ్లాక్”ను రిలీజ్ చేసి మహేష్ తప్పు చేశాడేమో అనిపిస్తుంది.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.