ఈ వయసులో కూడా ఇది అవసరమా… హీరో పై కామెంట్స్..!

కోలీవుడ్ స్టార్ హీరోలను అక్కడి ప్రజలు దేవుళ్ళుగా కొలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. భక్తి ఎక్కువయ్యి గుళ్ళు కట్టించడం కూడా మనం చూస్తూనే వున్నాం. అలా హీరో అజిత్ కు అక్కడ పిచ్చ క్రేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఏడాది ఇప్పటికే.. ‘నేర్కొండ పార్వై’, ‘విశ్వాసం’ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు అజిత్. ‘విశ్వాసం’ చిత్రం ఏకంగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టడం విశేషం. ఇక హిందీలో హిందీ ‘పింక్’ రీమేక్ అయిన ‘నేర్కొండ పార్వైగా’ 180 కోట్ల వరకూ గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

shocking-trolls-on-hero-ajith-kumar

ఈ చిత్రాన్ని శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మించగా ‘ఖాకీ’ ఫేమ్… హెచ్. వినోద్ డైరెక్ట్ చేశాడు. ఇక ఇదే కాంబినేషన్లో మరో చిత్రం రాబోతున్నట్టు తెలుస్తుంది. తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని భారీ ప్లాన్ వేస్తున్నారట. ఇదిలా ఉండగా… సినిమా కోసం ఎంతయినా కష్టపడతాడు అజిత్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. 48ఏళ్ళ వయసులో కూడా వర్కౌట్లు చేస్తూ బాడీ షేప్ ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడట అజిత్. ‘వివేగం’ సినిమాకు బాడీని ఫిట్ గా మెయింటైన్ చేయడం కోసం చాలా వర్కౌట్లు చేసాడు అజిత్. ఇక తన తదుపరి సినిమా కోసం కూడా మరింత కష్టపడుతున్నాడట. ఇందుకు గానూ.. రోజుకు ఐదు గంటల పాటు జిమ్ చేస్తూ.. బిజీగా ఉన్నాడని కోలీవుడ్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. గతంలో అజిత్ ఆరోగ్యం చాలా వరకూ దెబ్బ తినడం వల్ల చాలా ‘వెయిట్’ అయ్యాడు. అందుకు డాక్టర్లు అతన్ని ఎటువంటి వర్కౌట్ లు చేయకూడదని చెప్పారట. అయినప్పటికీ సినిమా కోసం రిస్క్ చేస్తూనే వస్తున్నాడు అజిత్. ఈ వయసులో ఈ పనులు అవసరమా అని ఎంతమంది చెప్పినా వినడం లేదని తెలుస్తుంది. ఇక కొత్త ప్రాజెక్ట్ ను డిసెంబర్లో మొదలు పెట్టి.. వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేసేలా ప్లాన్ ను రెడీ చేశారట.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.