‘బిగ్ బాస్3’ నుండీ ట్రోలింగ్ కు గురైన మొదటి కంటెస్టెంట్

ఎట్టకేలకు ‘బిగ్ బాస్3’ ప్రారంభమైంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ప్రారంభం కావడానికి ముందే చాలా వివాదాలు ఏర్పడ్డాయి. ఇక షో మొదలైనప్పుడు కంటెస్టెంట్ ల పై రకరకాల మీమ్స్ తో ట్రోల్ల్స్ రావడం సహజమే. ఇప్పుడు నటి అషూ రెడ్డి తో ఆ ట్రోల్స్ మొదలయ్యాయి. టిక్ టాక్ వీడియోలతో జూనియర్ సమంత లాగా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది అషూ రెడ్డి. అయితే ఈ షోలో ఆమె ఎంట్రీ చూసి చాలా మంది షాక్ కు గురయ్యారు. దీనికి అసలు కారణం… ఆమె లావుగా కనిపించడమే…!

shocking-trolls-on-ashu-reddy-bigg-boss

ఇప్పటివరకూ ఆమె చేసిన టిక్ టాక్ వీడియోల్లో సన్నగా కనిపించి.. ఇప్పుడు ఇలా లావుగా కనిపించడం పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఇన్ని రోజులు స్లిమ్ ఫిల్టర్లు యూజ్ చేసిందేమో.. కానీ ‘స్టార్ మా’ కెమెరాల్లో ఆ ఫిల్టర్ లేదు కాబట్టి ఆమె అసలు రూపం బయటకొచ్చింది. ఇప్పటి వరకూ ఆమె లుక్ అంతా ఫేక్ అన్నమాట… మొత్తానికి అందరినీ బలే బురిడీ కొట్టించింది’.. అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అషూ రెడ్డి అభిమానులు మాత్రం… ‘చాలా మంది అషు రెడ్డి బరువు గురించి మాట్లాడుతున్నారు. కొందరు మహిళలు కూడా ఈ విషయం పైనే కామెంట్లు చేస్తున్నారు. మరీ ఇంతలా దిగజారిపోతున్నారేంటి.? ‘బిగ్ బాస్’ లాంటి చెత్త షో చూడటానికి చాలా మందికి సమయం ఉంటుంది, వాటిపై డిస్కషన్లు జరిపేంత సమయం కూడా ఉంటుంది. నిజంగా మీరు చాలా లక్కీ” అంటూ ఆమె అభిమానులు ఆ ట్రోల్స్ ను తిప్పికొడుతున్నారు.

Share.