ఆర్తి అగర్వాల్ మృతికి అసలు కారణమిదేనా..

వెంకటేష్ హీరోగా విజయభాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచమయ్యారు ఆర్తి అగర్వాల్. తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఆర్తి అగర్వాల్ కు స్టార్ హీరోల సినిమాలలో వరుస ఆఫర్లు వచ్చాయి. చిరంజీవి, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇంద్ర సినిమాలో ఆర్తి అగర్వాల్ స్నేహలతారెడ్డి పాత్రలో అద్భుతంగా నటించారు. వసంతం, నేనున్నాను, సంక్రాంతి, అందాల రాముడు సినిమాలు ఆర్తి అగర్వాల్ కెరీర్ లో హిట్లుగా నిలిచాయి. కెరీర్ తొలినాళ్లలో స్లిమ్ గా కనిపించిన ఆర్తి అగర్వాల్ తర్వాత కాలంలో లావయ్యారు.

జంక్షన్ లో జయమాలిని అనే సినిమాలో ఆర్తి అగర్వాల్ కు హీరోయిన్ ఛాన్స్ రాగా ఆ సినిమా కోసం ఆర్తి అగర్వాల్ బరువు తగ్గే ప్రయత్నం చేశారు. ఆర్తి అగర్వాల్ ఆ ప్రయత్నం వల్లే ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. 2015 లో బరువు తగ్గడం కోసం ఆర్తి అగర్వాల్ లైపోసక్షన్ ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే ఆ ఆపరేషన్ వికటించటంతో 2015 సంవత్సరం జూన్ నెల 6వ తేదీన ఆర్తి అగర్వాల్ మృతి చెందారు. తెలుగులోని దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన ఆర్తి అగర్వాల్ ఒక హీరోతో ప్రేమలో ఉన్నట్టు కూడా జోరుగా ప్రచారం జరిగింది.

బరువు పెరగడం వల్ల మూవీ ఆఫర్స్ తగ్గడంతో డిస్ట్రబ్ అయిన ఆర్తి అగర్వాల్ మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ కావాలనే ఉద్దేశంతో లైపోసక్షన్ చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 14 సంవత్సరాల వయస్సులో మోడలింగ్ ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన ఆర్తి అగర్వాల్ బాలీవుడ్‌లో పాగల్‌పాన్‌ సినిమాతో సినిమా రంగంలో ఎంట్రీ ఇవ్వగా తెలుగులో ఆమెకు వరుస ఆఫర్లతో పాటు విజయాలు వచ్చాయి. 2005 సంవత్సరంలో ఆర్తీ అగర్వాల్ ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.