‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్ల గురించి ఆసక్తికరమైన విషయాలు

తెలుగునాట బిగ్ బాస్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సీజన్ ను జూ.ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. ఇక రెండో సీజన్ ను కూడా నాని సక్సెస్ ఫుల్ గా రన్ చేయాలని మొదలు పెట్టినా… కంటెస్టెంట్లు వివాదాలు పెట్టుకుంటూ రచ్చ రచ్చ చేసి.. హోస్ట్ నానిని కన్ఫ్యూజ్ చేసేసారు. ఆ కంటెస్టెంట్ల వివాదాలు ఇప్పటికి తగ్గలేదనుకోండి.. అది వేరే విషయం. కానీ హోస్ట్ గా మాత్రం నాని ఆకట్టుకున్నాడు. ఇక నాని ఫేస్ చేసిన నెగిటివిటీ… మరో హీరో ఫేస్ చేయడానికి ముందుకు రాలేదు. ఈ క్రమంలో దీనిని చక్కగా నడిపేందుకు నాగార్జున రంగంలోకి దిగాడు. అనేక వివాదాల నడుమ మొదలైన.. ‘బిగ్ బాస్3’ ఘనంగా మొదలైంది. నాగార్జున ఎంట్రీ అదిరిపోయింది. అలాగే మొదటి రోజు షో ను కూడా బ్రహ్మాండంగా నడిపించాడు. అప్పుడే ‘బిగ్ బాస్’ కు నాగార్జునే కరెక్ట్ హోస్ట్ అనేలా అదరగొట్టాడు. ఇక ‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్లు ఎవరు..? వారి గురించి ఓ లుక్కేద్దాం రండి :

1) తీన్మార్ సావిత్రి :

bigg-boss-3-telugu-contestants-8

‘V6’ ఛానల్ లో తెలంగాణ యాసలో తీన్మార్‌ వార్తలు చదివే… సావిత్రి అక్క(శివ జ్యోతి) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమెకు మంచి క్రేజ్ ఉంది. ‘బిగ్ బాస్3’ లో మొదటి కంటెస్టెంట్ ఈవిడే. మరి ఈమె టైటిల్ గెలుస్తుందో లేదో చూడాలి.

2) రవికృష్ణ :

bigg-boss-3-telugu-contestants-9

బుల్లితెర పై రవికృష్ణ క్రేజీ హీరో లాంటివాడు. ‘మొగలి రేకులు’ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి సీరియల్స్ తో బాగా ఫేమస్ అయ్యాడు. మరి ‘బిగ్ బాస్3’ రెండో కంటెస్టెంట్ గా వచ్చిన రవికృష్ణ టైటిల్ గెలిచి హీరోగా నిలబడతాడా లేదా అనేది చూడాలి.

3) అషూ రెడ్డి :

bigg-boss-3-telugu-contestants-10

జూనియర్ సమంతగా ‘టిక్ టాక్’ లో వీడియోలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్న అషూ రెడ్డి… నితిన్ హీరోగా నటించిన ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రంలో కూడా నటించింది. సోషల్ మీడియాలో ఈమె మంచి క్రేజ్ సంపాదించుకుంది. మరి మూడో కంటెస్టెంట్ గా వచ్చిన అషూ రెడ్డి.. ‘బిగ్ బాస్3’ టైటిల్ గెలుస్తుందో లేదో చూడాలి.

4) జాఫర్‌ :

bigg-boss-3-telugu-contestants-11

‘టీవీ 9’ లో ప్రసారమయ్యే ‘ముఖాముఖి’ ప్రోగ్రాంలో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ పేరుతో ఇరిటేట్ చేసే ప్రశ్నలు వేసే జాఫర్‌ గురించి కూడా అందరికీ తెలిసిందే. ఈయన నాలుగవ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి టైటిల్ గెలిచే లక్షణాలు ఈయనకి ఉన్నాయో లేదో చూడాలి.

5) హిమజ రెడ్డి :

bigg-boss-3-telugu-contestants-13

కొన్ని సీరియల్స్ తో పాటు.. సినిమాల్లో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది హిమజ రెడ్డి. ‘నేను శైలజ’ ‘శతమానం భవతి’ ‘వినయ విధేయ రామా’ వంటి చిత్రాలలో నటించింది. ఐదవ కంటెస్టెంట్ గా వచ్చిన హిమజ.. షో లో ఎలా అలరిస్తుందో చూడాలి.

6) రాహుల్‌ సిప్లిగంజ్‌ :

bigg-boss-3-telugu-contestants-14

‘రంగస్థలం’ చిత్రంలో ‘రంగ రంగ’ అనే సాంగ్ తో పాటు.. నితిన్ ‘లై’ చిత్రంలోని ‘బొంబాట్’ , ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రంలోని ‘పెద్దపులి’ పాటలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న రాహుల్‌ సిప్లిగంజ్‌ కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసాడు. ఆరవ కంటెస్టెంట్ గా వచ్చిన రాహుల్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడో చూడాలి.

7) రోహిణి :

bigg-boss-3-telugu-contestants-15

రాయలసీమ యాసతో సీరియల్స్ లో బాగా ఫేమస్ అయిన రోహిణి ఏడవ కంటెస్టెంట్. సహజంగా కామెడీ చేస్తూ అలరించే ఈమె.. ఈ షో లో ఎలా ఉంటుందో చూడాలి.

8) బాబా భాస్కర్‌ :

bigg-boss-3-telugu-contestants-1

‘పేట’ చిత్రంలో ‘మరణ మాస్’ అనే పాటకి రజినీతో స్టెప్పులేయించిన బాబా భాస్కర్ మాస్టర్ ఎనిమిదవ కంటెస్టెంట్ గా వచ్చాడు. మంచి జోష్ లో ఎంట్రీ ఇచ్చిన బాబా మాస్టర్.. అదే జోష్ లో హౌస్ లో కొనసాగుతాడో ఏదో చూడాలి..!

9) పునర్నవి భూపాలం :

bigg-boss-3-telugu-contestants-2

‘ఉయ్యాల జంపాల’ ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ వంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న పునర్నవి భూపాలం అందరికీ పరిచయమే. తొమ్మిదవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. హౌస్ లో ఎలా కొనసాగుతుందో చూడాలి..!

10) హేమ :

bigg-boss-3-telugu-contestants-3

సినీ నటి హేమ పదవ కంటెస్టెంట్. చాలా చిత్రాల్లో నటించి మెప్పించిన ఈమె ఓ విధంగా ‘రెబల్ లేడీ’ అనే చెప్పాలి. ఏ మాటైనా మొహం మీదే అనేస్తుంటుంది. ఈ షోలో గొడవలనేవి మొదలైతే ఈమె నుండే మొదలయ్యే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. మరి అది ఎంతవరకూ నిజమో చూడాలి.

11) అలీ రెజా :

bigg-boss-3-telugu-contestants-4

కొన్ని సీరియల్స్ తో పాటు… ‘ధృవ’ చిత్రంలో రాంచరణ్ స్నేహితుడిగా కనిపించి అలరించాడు అలీ రెజా. పదకొండవ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అలీ రెజా ఎలా అలరిస్తాడో చూడాలి.

12) మహేష్ విట్టా :

bigg-boss-3-telugu-contestants-5

‘ఫన్ బకెట్’ కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యి… ‘నేనే రాజు నేనే మంత్రి’ ‘ఛలో’ ‘కృష్ణార్జున యుద్ధం’ వంటి చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నారు. మహేష్ విట్టా. పన్నెండవ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ‘యూట్యూబ్ సెన్సేషన్’.. టైటిల్ గెలుస్తాడో లేదో చూడాలి.

13) శ్రీముఖి :

bigg-boss-3-telugu-contestants-6

‘పటాస్’ ‘జూ లకటక’ వంటి షోలతో బుల్లితెరను ఓ ఊపు ఊపేసిన శ్రీముఖి… ‘జులాయి’ ‘నేను శైలజ’ వంటి చిత్రాలలో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. పదమూడవ కంటెస్టెంట్ గా ‘బిగ్ బాస్3’ కి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. టైటిల్ గెలుస్తుందో లేదో చూడాలి.

14) వరుణ్‌ సందేశ్‌, వితికా షేరు :

bigg-boss-3-telugu-contestants-16

‘హ్యాపీ డేస్’ ‘కొత్త బంగారులోకం’ ‘ఏమైంది ఈవేళ’ వంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వరుణ్ సందేశ్ తన సతీమణి వితికా షేరుతో కలిసి ‘బిగ్ బాస్3’ హౌస్ లోకి 14,15 కంటెస్టెంట్లు గా ఎంట్రీ ఇచ్చారు. ‘బిగ్ బాస్’ మొదలయ్యాక ఓ కపుల్ హౌస్ లోకి వెళ్ళడం మొదటిసారి. ‘మరి హౌస్ లో ‘బిగ్ బాస్’ ఇచ్చే టాస్క్ లు వీరిద్దరూ ఎలా ఆడతారు.. ఈ షో వలన వీరిద్దరూ గొడవలు పడరు కదా..?’ అనే సందేహాలు ఇంకా చాలా ఉన్నాయి. మరి ముందు ముందు ఈ జంట ఎలా ఉండబోతున్నారనేది చూడాలి.

ఇక అందరు కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపిన తరువాత.. హౌస్ కు తాళం వేసి విసిరేశారు హోస్ట్ నాగార్జున. అయితే షో ముగిసే సమయంలో కొందరు ఎలిమేషన్స్ కు నామినేట్ అయినట్టు కూడా చూపించి మొదటి రోజే షాకిచ్చారు ‘బిగ్ బాస్’. ఇక ఈరోజు నుండీ అసలు కథ మొదలుకానుంది.

Share.