షాకిస్తున్న అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోకి వచ్చి 17 ఏళ్ళు అవుతున్నా… ఇంకా కొత్తగా కొత్తగా ఏదైనా చెయ్యాలి అని ట్రై చేస్తూ ఉంటాడు మన బన్నీ. టాలీవుడ్ కు 6 ప్యాక్ ను పరిచయం చేసినా.. సరికొత్త డ్యాన్స్ లతో పరభాషా స్టార్స్ ను కూడా ఆకర్షిస్తూ ఉంటాడు. టైగర్ ష్రాఫ్, రోహిత్ శెట్టి వంటి బాలీవుడ్ స్టార్లు కూడా బన్నీ డ్యాన్స్ గురించి ప్రశంసలు కురిపించారు అంటే అతని క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

మలయాళంలో కూడా ఇతనికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా అల్లు అర్జున్ ఆస్తుల వివరాల గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. అల్లు అర్జున్ స్టార్ హీరో కాబట్టి.. ప్రతీ సినిమాకి 18 నుండీ 20 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక అతని లైఫ్ స్టైల్ ను చూసుకుంటే.. బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్, జాగ్వర్, ఆడీ, టయోటా క్రూజర్… వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇక అతని ప్రతీ డ్రెస్ ను డిజైన్ చెయ్యడానికి ఓ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఉన్నడట.

అంతేకాదు అతని 7 కోట్ల విలువ గల కార్ వ్యాన్ ఉంది. అంతేకాదు హైదరాబాద్ లో రెండు పబ్ లు కూడా ఉన్నాయట. అంతేకాకుండా పలు ఐటికంపెనీలలో పెట్టుబడులు కూడా పెడుతున్నాడట. ఇలా మొత్తం కలిపి అల్లు అర్జున్ కు 1500 కోట్ల ఆస్తి ఉంటుందట. ఇక అల్లు అర్జున్ తండ్రి కూడా ఇండస్ట్రీని శాసించే స్టార్ ప్రొడ్యూసర్ కాబట్టి .. ఈ లెక్క నిజమే అయ్యుండొచ్చు అని చాలా మంది చెబుతున్నారు.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Share.